కృష్ణ

కారుణ్య మరణ దరఖాస్తుపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: తాను మరణించేందుకు ప్రభుత్వం అనుమతించాలంటూ మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామానికి చెందిన 58 సంవత్సరాల వయస్సు గల గాకర్ల శ్రీహరి కలెక్టర్‌కు పెట్టుకున్న అర్జీపై సోమవారం మొవ్వ మండల అధికారులు బాధితుడితో చర్చలు జరిపారు. మొవ్వ మండలం పెదముత్తేవి దళితవాడకు చెందిన గాకర్ల శ్రీహరి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఇతనికి 20 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న ఇతను పిల్లలకు వివాహం చేశాడు. ఇటీవల గృహం కూడా దగ్ధమైంది. వరుసగా సంభవించిన సమస్యలతో జీవితంపై విరక్తి చెంది కలెక్టర్‌కు కారుణ్య మరణానికి అర్జీ పెట్టుకున్నాడు. కలెక్టర్ ఆదేశం మేరకు సోమవారం మొవ్వ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బి రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ వి ఆనందరావు, ఎస్‌ఐ హబీబ్ భాషా, పీహెచ్‌సీ వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ, అధికారుల సమక్షంలో బాధితుడు శ్రీహరిని పిలిపించి చర్చలు జరిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు.

నివేశన స్థలాలను పరిశీలించిన ఆర్డీవో
చల్లపల్లి, జనవరి 27: బందరు ఆర్డీవో ఖాజావలీ సోమవారం చల్లపల్లిలో పర్యటించారు. గ్రామంలో నివేశన స్థలాల పంపిణీకి సంబంధించి రెవెన్యూ అధికారులు స్తానిక నారాయణరావు నగర్‌లో ఎంపిక చేసిన భూములను ఆయన పరిశీలించారు. చల్లపల్లిలో 1044 మంది అర్హులకు సెంటున్నర చొప్పున పంపిణీ చేసేందుకు 28.20 ఎకరాల భూమి అవసరం ఉందని తహశీల్దార్ తెలిపారు. ఆర్డీవో వెంట ఆర్‌ఐ శివరామకృష్ణ, సర్వేయర్ కిషోర్, వీఆర్‌ఓలు నారాయణ, నాగమణి తదితరులు ఉన్నారు.

‘పది’లో పైమెట్టు సాధించాలి
కృత్తివెన్ను, జనవరి 27: పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పై మెట్టు సాధించాలని మండల విద్యాశాఖాధికారి ఎన్‌ఎస్‌వి ప్రసాద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం విజయ కుమారి, ఉపాధ్యాయులు కుమార్, జోత్స్నదేవి పాల్గొన్నారు.