కృష్ణ

‘నవరత్న’ శకటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ నందు ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల అధికారులు ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన నవరత్నాలు ప్రతిబింబించాయి. అన్ని శాఖల అధికారులు నవరత్నాలను ప్రధాన అజెండాగా తీసుకుని శకటాలను ప్రదర్శింప చేశారు. శకటాల ప్రదర్శనలో పాల్గొన్న శాఖలు కూడా తొమ్మిది కావడం విశేషం. నవరత్నాల ద్వారా ఆరోగ్యం, సంక్షేమం, ఉపాధి, జీవనోపాధి అంటూ సాగిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. జగనన్న అమ్మఒడి, మన బడి నాడు - నేడు పథకాలను ప్రధానంగా తీసుకుని సాగిన పాఠశాల విద్యా - సమగ్ర శిక్షా శకటానికి ద్వితీయ స్థానం లభించింది. తృతీయ బహుమతిని మహిళా శిశు సంక్షేమ శాఖ దక్కించుకుంది. ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా.కె మాధవీలత, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు బహుమతులను అందచేశారు.