కృష్ణ

మీ సేవలు ప్రశంసనీయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలులో గణనీయమైన ప్రగతి సాధించిన అధికారులు ఆదివారం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. మొత్తం 571 మందికి ప్రశంసా పత్రాలు ఇవ్వగా ఇందులో 23 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వీరిలో ఐఎఎస్ అధికారులైన నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యాన చంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, జాయింట్ కలెక్టర్-2 కె మోహన్ కుమార్, ముడా వీసీ పి విల్సన్‌బాబు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం చక్రపాణి, సివిల్ సప్లయిస్ డీఎం కె రాజ్యలక్ష్మి, బందరు ఆర్డీవో ఎన్‌ఎస్‌కె ఖాజావలీ, టిట్‌కో పీఓ చిన్నోడు, డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎం శ్రీనివాసమూర్తి, జడ్పీ సీఇఓ పిఎస్ సూర్యప్రకాశరావు, విజయవాడ డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు, ట్రజరీ డీడీ వి నాగ మహేష్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఈశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ టి మోహనరావు, డీఆర్‌డీఎ పీడీ ఎం శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్‌ఇ కెవిఎల్‌ఎన్‌పి చౌదరి, ఆర్‌డబ్ల్యుయస్ ఎస్‌ఇ సిహెచ్ అమరేశ్వరరావు, మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, విజయవాడ ఎక్సైజ్ ఇఎస్ పివి రమణమూర్తి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. వెలగా జోషి తదితరులు ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు.ఆంధ్రభూమి బ్యూరో