కృష్ణ

మేరా భారత్ మహాన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్): భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి, జాతీయతా భావాన్ని ఉట్టి పడేలా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించే దుస్తులతో విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో జిల్లాలోని పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పలు దేశభక్తి గీతాల నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. తొలిగా పెడన జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అనే దేశభక్తి గీతంతో సాంస్కృతిక ప్రదర్శనలను ప్రారంభించారు. అనంతరం ఇండియా వాలే.. అంటూ దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు, ఈ జెండా పసిబోసి చిరునవ్వుల జెండా.. అంటూ జవహర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, పుణ్యభూమి నా దేశం.. అంటూ రాజుపేట లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా సెయింట్ వినె్సంట్ పల్లోటి పెడన విద్యార్థులు ప్రదర్శించిన సైనిక విన్యాసాలు అబ్బురపర్చారు. పుణ్యభూమి నా దేశమంటూ దేశభక్తిని కళ్లకు కట్టినట్టు చూపిన రాజుపేట లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు ప్రథమ బహుమతిని కైవసం చేసుకోగా సెయింట్ వినె్సంట్ పల్లోటి హైస్కూల్, పెడన జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల ప్రదర్శనలకు ద్వితీయ బహుమతి లభించాయి. దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్, జవహర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలకు తృతీయ స్థానం లభించింది. కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జేసీ డా. కె మాధవీలత, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తదితరులు విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.

సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనలో వినూత్న మార్పులు
* నగరంలో సచివాలయ సేవలను ప్రారంభించిన మంత్రి పేర్ని

మచిలీపట్నం, జనవరి 26: సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనలో వినూత్న మార్పులు రానున్నాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. పారదర్శకతతో కూడిన పాలన అందరికీ అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థను ఆదివారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక 25వ వార్డు జెండా సెంటరులో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాన్ని మంత్రి పేర్ని ప్రారంభించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సొంత ప్రాంతంలోనే ప్రభుత్వం ఉద్యోగం చేసే భాగ్యం చాలా తక్కువ మందికి వస్తుందన్నారు. అందులో సచివాలయ ఉద్యోగులు ఉండటం అభినందనీయమన్నారు. సచివాలయ ఉద్యోగులంతా సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా అర్హులకే సంక్షేమ ఫలాలు అందే విధంగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను ప్రభుత్వం నియమించిందని, వీరి ద్వారానే ప్రభుత్వ సేవలు ఆయా కుటుంబాల వారికి అందుతాయన్నారు. ప్రత్యేక వ్యవస్థగా సచివాలయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు. చేసే ప్రతి పనిలో జవాబుదారీతనం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, జామియా మసీదు అధ్యక్షుడు మహ్మద్ అంజాద్ పాషా, ఎఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.