కృష్ణ

ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఏపీఎస్ ఆర్‌టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇప్పటికే ఆర్టీసీ అంగీకరించిందని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావు లేదన్నారు. శనివారం మంత్రి పేర్ని నాని తన కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మృతి చెందారని, గత కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఇబ్బందులకు గురవుతున్నట్టు పలువురు మంత్రి పేర్ని నానికి తెలియజేశారు. జిల్లాలో 78 మంది, రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని కొడాలి అన్నమయ్య, జి రత్నాకర్, హరీష్, శివ రాజేశ్వరరావు, జి గోపీకృష్ణ తదితరులు మంత్రికి తెలియజేశారు. గత ఆగస్టు 21వతేదీన నరసాపురం ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దుర్మరణం పాలైన ఫోటోగ్రాఫర్ నిప్పులేటి పైడేశ్వరరావు సతీమణి లక్ష్మి మంత్రి పేర్నిని కలిసి ప్రభుత్వపరంగా సహాయం అందించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.

*