కృష్ణ

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): నూరు శాతం పోలింగ్ నమోదు కావడానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బందరు ఆర్డీవో ఎన్‌ఎస్‌కె ఖాజావలీ కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. తొలుత లక్ష్మీటాకీసు సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థినీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీనియర్ ఓటర్లను సత్కరించారు. ఓటు హక్కుపై విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన వ్యాసన రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. కొత్తగా ఓటరుగా నమోదైన వారికి ఓటరు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఓటరుగా నమోదు కావడానికి ఫారమ్-6 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో 70 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అవుతుందన్నారు. దీన్ని నూరు శాతం పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి మధుసూదనరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖరరావు, ఆర్‌ఐలు యాకూబ్, విజయలక్ష్మి, సీనియర్ సిటిజన్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ముడా వీసీ విల్సన్‌కు ది బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు

మచిలీపట్నం, జనవరి 25: ఇటీవల నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో పెడన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేసిన మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్నారు. శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వీసీ విల్సన్‌బాబును కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, డీఆర్‌ఓ ఎ ప్రసాద్ తదితరులు అభినందించారు.