కృష్ణ

మూడు రాజధానులపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మూడు రాజధానుల అంశంపై ప్రజాభిప్రాయం జరిగి తీరాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఎ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందుకు తెలుగు జాతి అంతా హర్షిస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం తనకు అనుకూలంగా లేదన్న కారణంతో శాసనమండలిని రద్దు చేసేందుకు సిద్ధమవ్వడం గర్హనీయమన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ జీఎన్ రావు, బీసీజీ, హైపవర్ కమిటీలంటూ ముఖ్యమంత్రి జగన్ అనధికార కమిటీలను వేసుకుని మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించడం సిగ్గు చేటన్నారు. సంఖ్యా బలం ఉందన్న ఒకే ఒక్క కారణంతో అసెంబ్లీలో బిల్లు ఆమోదం జరిగిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. శాసనసభలో స్పీకర్ మాట్లాడాల్సిన మాటలను సీఎం జగన్ మాట్లాడుతున్నారన్నారు. సీఎం చెప్పిన విధంగా స్పీకర్ నడుచుకుంటున్నారని విమర్శించారు. తెలుగు ప్రజలు, తెలుగు జాతి మీద ఉన్న నమ్మకాన్ని జగన్ దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనమండలి రద్దు కేవలం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను సంతలో పశువులను కొన్నట్టు కొనేందుకు చేసే ప్రయత్నమేనన్నారు. ఆ ప్రయత్నాలు ఫలించవన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్సీ అర్జునుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, అమరావతి జేఎసీ కన్వీనర్ కోస్తా మురళి, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.