కృష్ణ

ఉద్యోగాలకు సిఫార్సులు చెల్లవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగానైతే ప్రాథమిక హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తున్నారో దివ్యాంగులు సైతం వారితో సమానంగా తమ హక్కులను అనుభవించిన నాడే వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందగలరని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. గురువారం వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ తన కార్యాలయానికి వచ్చిన పలువురి నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కేలా రికమండేషన్ చేయమని అడిగిన వ్యక్తికి మంత్రి పేర్ని నాని సమాధానం చెబుతూ అంగవైకల్య శాతం, ఎంప్లాయిమెంట్ సీనియారిటీ, 44 యేళ్ల గరిష్ట వయో పరిమితికి ఎంత చేరువలో ఉన్నారనే ప్రాతిపదికన ఆయా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో నిష్పక్షపాతంగా ఆయా ఎంపిక జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరి రికమండేషన్లు చెల్లవని, దళారుల మాయమాటలు విని డబ్బులు ఇచ్చి మోసపోరాదని మంత్రి నాని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో
కిశోరి వికాసం అవగాహన
కూచిపూడి, జనవరి 23: వైఎస్‌ఆర్ కిషోర్ వికాసం కార్యక్రమంలో భాగంగా గురువారం మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, శ్రీ లక్ష్మీపతి స్వామి విద్యావిహార్ విద్యార్థులచే మానవహారంతో ప్రచారం చేపట్టారు. పాఠశాల హెచ్‌ఎం కె మాధవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సలీమున్నీసా ఆధ్వర్యంలో కిషోర బాలికలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ
అవనిగడ్డ, జనవరి 23: మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీ, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి ఐదు రోజులు పాటు నిర్వహించనున్న సందర్భంగా అందుకు సంబంధించిన గోడ పత్రికలను గురువారం శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సింహాద్రి క్యాంప్ కార్యాలయంలో ఈ ఆవిష్కరణ జరగ్గా ఆలయ సహాయ కమిషనర్, ఇఓ లీలాకుమార్, పార్టీ నాయకులు కె నరసింహారావు, సింహాద్రి వెంకటేశ్వరరావు తదితరులు గోడ పత్రికలను ఆవిష్కరించిన వారిలో ఉన్నారు.

దీక్షా శిబిరంలో నేతాజీ జయంతి
మచిలీపట్నం(కల్చరల్), జనవరి 23: స్థానిక ప్రధాన పార్కు ఎదురుగా గత 20 రోజులుగా కొనసాగుతున్న అమరావతి రాజధాని రిలే దీక్షా శిబిరంలో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని నిర్వహించారు. చంద్రబోస్ స్ఫూర్తితో అమరావతి రాజధాని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం (చంటి) తదితరులు పాల్గొన్నారు.