కృష్ణ

బందరులో మాజీ మంత్రి ‘కొల్లు’ అరెస్ట్, విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం నగరంలో టీడీపీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలు చేతబూని ప్రధాన రహదారిలో నిరసన ప్రదర్శన, కోనేరుసెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. కోనేరుసెంటరులో రాస్తారోకో చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో పోలీసులు మాజీ మంత్రి రవీంద్రతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేసి సమీపంలోని ఆర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆర్‌పేట స్టేషన్ వద్ద కూడా కార్యకర్తలు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కొద్దిసేపు నిరసన తెలియజేశారు. అరెస్టు అయిన మాజీ మంత్రి రవీంద్ర, ఇతరులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ అమరావతి రాజధాని విషయమై శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులతో రెచ్చగొట్టే విధంగా వ్యహరిస్తోందన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇలియాస్ పాషా, కొట్టె వెంకట్రావ్, గోపు సత్యనారాయణ, కుంచే దుర్గాప్రసాద్, గనిపిశెట్టి గోపాల్, పివి ఫణికుమార్, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు.