కృష్ణ

రెండు చుక్కలు నిండు జీవితానికి భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మారి నుంచి కాపాడుకోవచ్చని తద్వారా చిన్నారుల నిండు జీవితానికి భరోసా కల్పించినవారమవుతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నాని స్థానిక ఉల్లింగిపాలెంలోని గుమ్మటాల చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియోను భారత దేశం నుంచి సమూలంగా తరిమివేసే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు విధిగా వేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె మాధవీలత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఖాజావలీ, మున్సిపల్ కమీషనర్ రామకృష్ణ, తహశీల్దార్ సునీల్, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ మోకా భాస్కరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్ దాదా, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ అచ్చాబా తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ 16వ మహాసభలను విజయవంతం చేయండి
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 19: సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయు) అఖిల భారత 16వ మహాసభలు మద్రాసులో జరుగుతున్న సందర్భంగా ఆ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోనేరుసెంటరులో ముఠా ఆఫీసు వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవి, సీఐటీయు బుట్టాయిపేట ఆఫీసు వద్ద సీఐటీయూ సీనియర్ నాయకుడు ఎస్ ధనుంజయరావు సీఐటీయు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు ద్వారా సాధించుకున్న కార్మకుల హక్కుల యొక్క చట్టాలను సవరించి, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ చట్టాలను తయారు చేస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా వ్యాపారవేత్తలకు వేల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో రాయితీలు ఇస్తోందన్నారు. రాబోయే కాలంలో కార్మికులు అందరూ ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శ బూర సుబ్రహ్మణ్యం, ఎల్‌ఐసీ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, టి చంద్రపాల్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తూర్పు కృష్ణ ప్రధాన కార్యదర్శి కెవి గోపాలరావు, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం పోలి నాయుడు, మాదాల వెంకటేశ్వరరావు, రాడ్ బెండింగ్ యూనియన్ నాయకులు పి రాజు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు కె నాని, కె కృష్ణ, శ్రీను, బి మల్లిఖార్జునరావు, గొల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.