కృష్ణ

పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ప్రారంభించిన ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): విజయవాడకు చెందిన న్యూ కావేరీ ఏజెన్సీ వారి సహకారంతో స్థానిక కోనేరుసెంటరులో నిర్మించిన పోలీస్ ట్రాఫిక్ ఔట్ పోస్ట్‌ను ఎస్పీ యం రవీంద్రనాధ్‌బాబు, ఎఎస్పీ ఎం సత్తిబాబుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బందరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే విషయంలో కోనేరుసెంటర్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న బందోబస్తు నిర్వహించేందుకు వస్తున్న ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఇక్కడకు వచ్చి వారికి సూచనలు చేసేందుకు, అదే విధంగా పోలీసు అధికారులు ఈ కోనేరుసెంటర్‌లో ఉండి పర్యవేక్షించేందుకు ఈ ఔట్ పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని, విజయవాడకు చెందిన న్యూ కావేరీ ఏజెన్సీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యూ కావేరి ఏజెన్సీ వంకధార వెంకటేశ్వరరావుకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ మెహబూబ్ భాషా, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, ఇనగుదురు సీఐ అఖిల్ జమా, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, ఎస్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మస్థాన్‌ఖాన్, ట్రాఫిక్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 19: 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా బందరు ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ టాక్సీ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు, ఎఎస్పీ సత్తిబాబు ఆదివారం ప్రారంభించారు. మెడికల్ క్యాంపులో షుగర్, బీపీ టెస్టులు, కంటి పరీక్షలు, వివిధ రకాల జ్వరాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు మాట్లాడుతూ 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా మచిలీపట్నంలో టాక్సీ, ఆటో డ్రైవర్లకు ఉచితంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మధుమేహ నిపుణులు డా. పవన్ కుమార్, కంటి వైద్య నిపుణులు డా. జయశ్రీ, బందరు డీఎస్పీ మెహబూబ్ భాషా, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, పోలీసు అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ మస్థాన్‌ఖాన్, సిబ్బంది, పట్టణ ప్రజలు, టాక్సీ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.