కృష్ణ

రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రోడ్డు భద్రత అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజూ అవసరమని, దానిని నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్యపర్చేందుకే రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ తమ వంతుగా కృషి చేస్తోందన్నారు. దేశంలో సంవత్సరానికి ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా లక్షా 40వేల మంది మృతి చెందుతున్నారన్నారు. మూడున్నర లక్షల మంది క్షతగాత్రులవుతున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే 40 శాతం మంది యువత రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నట్లు మంత్రి పేర్ని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వారు విధిగా తప్పనిసరిగా సీట్ బెల్టు, హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఎం అప్పారావు, వై నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్ తదితరులు పాల్గొన్నారు.