కృష్ణ

స్వగ్రామంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: సమాజంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి పేదల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగించిన దివంగత ఎన్టీ రామారావు ప్రస్తుతతరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయుడని మాజీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంతో పాటు నియోజకవర్గ కేంద్రం పామర్రులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతిలో ఆమె నివాళులర్పించారు. రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు ముందు, ఎన్టీఆర్‌కు తరువాత అనే రాజకీయ శకం ప్రారంభమైందన్నారు. మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం రాజధాని అమరావతిని తరలించరాదని, మూడు రాజధానులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కల్పన పుర వీధులలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొట్టిపాటి లక్ష్మీదాస్, టీడీపీ నేతలు పామర్తి విజయశేఖర్, పరసా సుబ్రహ్మణ్యం, చాట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కొరియా సంస్థతో ఆర్జేయూకేటీ ఒప్పందం
నూజివీడు, జనవరి 18: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం సౌత్ కొరియాకు చెందిన కొరియన్ కల్చరల్ అండ్ టెక్నాలజికల్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వవిద్యాలయం కులపతి కేసీ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్జేయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల డైరెక్టర్లు, విశ్వవిద్యాలయం ఉపకులపతి హేమచంద్రరెడ్డిల సమక్షంలో కొరియా సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థులకు నైపుణ్యం పెరగటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. కొరియస్థులు ఇక్కడి విద్యార్థులకు అధ్యాపకులుగా పనిచేస్తారని, దీని వల్ల ఇతర దేశాల బాషలు కూడా విద్యార్థులకు వస్తాయని అన్నారు. కొరియన్ కల్చర్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ కిమ్ మాట్లాడుతూ తమ సెంటరు ద్వారా ఆర్జేయుకేటీ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు కొరియా బాషను నేర్పించి, కొరియా కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయం ఉప కులపతి హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి ఒప్పందం దేశంలో ప్రప్రథమంగా ఆర్జేయుకేటీతో జరగటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ట్రిపుల్ ఐటీలలో అనుసరిస్తున్న వైవిద్యమైన విద్యాభ్యాసం వల్లే ఈ ఒప్పందం జరిగిందని, అయిదు సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డి సూర్యచంద్రరావు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ భానుకిరణ్, ఆర్యేవ్యాలీ డైరెక్టర్ బి సుధీర్‌ప్రేమకుమార్, ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సీ వెంకటరావు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌సీ అన్ని వర్గాలకు సమస్యాత్మకం
చల్లపల్లి, జనవరి 18: కేంద్రం దేశంలో అమలు చేయాలని చూస్తున్న ఎన్‌ఆర్‌సీ అన్ని వర్గాలకు సమస్యాత్మకంగా నిలుస్తుందని సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు అన్నారు. శనివారం స్థానిక చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలోని గౌసియా మసీదు వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, సీఏబీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో వీటికి వ్యతిరేకంగా తీర్మానం చేసి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని కోరారు. జనవరి 26న నిర్వహించ తలపెట్టిన మానవహారం, 30న జరగనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని రఘు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి యద్దనపూడి మధు, ఎస్సీ నాయకులు బండి ఆదిశేషు, బండారు కోటేశ్వరరావు, సీఐటీయు మండల కార్యదర్శి అన్నం గగారిన్, మైనార్టీ నాయకులు మీర్ రిజ్వాన్, షేక్ నబీ ఘోరీ, పఠాన్ కరీముల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.