కృష్ణ

రహదారి భద్రత మనందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రహదారి భద్రత మనందరి బాధ్యత అని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ వరకు రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ర్యాలీలు నిర్వహించారు. హెల్మెట్ వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. అతివేగం ప్రమాదకరమని, హడావిడి ప్రయాణానికి స్వస్తి చెప్పి ముందుగా బయలుదేరి గమ్యాన్ని క్షేమంగా చేరుకోవాలని వాహనచోదకులకు తెలియజేశారు. మద్యం సేవించడం వల్ల కలిగే అనార్థాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను ఖచ్చితంగా పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.

వెలగలేరులో రాష్టస్థ్రాయి హ్యాండ్‌బాల్ పోటీలు
జి.కొండూరు, జనవరి 18: కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెలగలేరులని చనమోలు పకీర్రాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19, 20 తేదీల్లో 5వ రాష్టస్థ్రాయి జూనియర్ అండర్-19 బాలికల అంతర జిల్లాల వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చనమోలు రామచంద్రరావు శనివారం తెలిపారు. నేడు శనివారం టీమ్స్ నమోదు చేసుకుని, గేమ్స్ నిర్వహణకు డ్రా తీసినట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈపోటీలను ప్రారంభిస్తారన్నారు. ఇందుకోసం హైస్కూలు మైదానంలో చకచకా ఏర్పాట్లు చేశారు. హైస్కూలు కమిటీ గౌరవ అధ్యక్షులు చనమోలు అనిల్‌కుమార్, స్టేట్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ పి.సత్యనారాయణరాజు తదితరులు పర్యవేక్షించనున్నారు. 13 జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు వెలగలేరులోని చనమోలు వెంకట్రావు, రంగనాయకమ్మ మరియు మాదాల అశోక్ కళ్యాణ మండపంలో వసతి ఏర్పాట్లను కల్పించారు.