కృష్ణ

జంక్షన్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హనుమాన్ జంక్షన్‌లో అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గాన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్తున్న చంద్రబాబుకు హనుమాన్ జంక్షన్ కూడలిలో పలువురు కలసి అమరావతి పరిరక్షణ పోరాటానికి సంఘీభావం తెలిపారు. రైతులు ప్రారంభించిన అమరావతి పరిరక్షణ పోరులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్న చంద్రబాబు పిలుపు మేరకు నూజివీడు మండలం సీతారామపురం గ్రామస్తులు సేకరించిన లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని గ్రామస్తుల తరఫున పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధి కన్నిగంటి రాజగోపాల్ చంద్రబాబుకు అందజేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజ్యసభ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి, విజయ డైరీ చైర్మన్ చలసాని అంజనేయులు, రాష్ట్ర అయిల్‌పామ్ సంఘం ప్రతినిధి బొబ్బా వీరరాఘవరావు, మండల పార్టీ అధ్యక్షుడు వీరమాచినేని సత్యప్రసాద్, జిల్లా పార్టీ నాయకులు వేగిరెడ్డి పాపారావు, దయాల రాజేశ్వరరావు, మహిళ నాయకురాలు మూల్పూరి కళ్యాణి, వీరమాచినేని శ్రీదేవి తదితరులు జంక్షన్ కూడలికి చేరుకుని చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించారు.
అమరావతికి మద్దతుగా జేఏసీ నాయకుల ప్రదర్శన
మూడు రాజధానులు వద్దని ఇప్పటికే అభివృద్ధి చేసిన అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ శనివారం హనుమాన్ జంక్షన్‌లో అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కూడలి వద్ద నాయకులు ప్రదర్శన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతుల త్యాగాలను పరిగణనలోకి తీసుకుని అమరావతిని తరలించవద్దని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రిని కోరారు.