కృష్ణ

కోడి పందాలకు బరులు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు: ప్రతి ఏడాది మాదిరిగానే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలకు బరులు సిద్ధమయ్యాయి. పార్టీలు వేరైనా సంప్రదాయాన్ని మాత్రం కొనసాగించడానికి ఎమ్మెల్యే పార్థసారథి ద్వారా అనుమతుల కోసం స్థానిక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో వణుకూరు, పోరంకి, యనమలకుదురు గ్రామాల్లో బరుల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కోడి పందాలు వేసినా, చూసినా నేరమంటూ మధ్యమధ్యలో పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా బరుల ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో జరిగిపోతున్నాయి. నిర్వాహకులు పోలీసు శాఖ అనుమతి కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పోలీసులు వంద మందికి పైగా కోడి పందాలు ఆడేవారిపై బైండోవర్ కేసులు పెట్టి అదుపులోకి తీసుకుంటున్నారు. కోడి పందాలు వేయటం నేరమని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే కోడి పందాలు ఎప్పుడు మొదలవుతాయా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. పండుగ ముందురోజు నుండి పోలీసులే అనుమతి ఇస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బరుల నిర్వాహకులు ఊరి చివర పొలాల్లో ఏర్పాట్లకు లక్షల రూపాయలు వ్యయం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదనే ఒక్క మాట తప్ప పందాలకు ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో జరిగిపోతున్నాయి.