కృష్ణ

రోగులకు సేవ చేయడం దేవుడిచ్చిన వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నర్సింగ్ విద్యను అభ్యసించడం నామమాత్రపు విషయంగా పరిగణించక భగవంతుడు రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఇచ్చిన అపూర్వ అవకాశంగా భావించటంతో పాటు దేవుడిచ్చిన వరంగా చూడాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నర్సింగ్ విద్యార్థినులకు సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ ఫౌండేషన్ ల్యాబ్‌ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ త్వరలోనే నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇందుకు గాను ఆదర్శనగర్‌లోని రాడార్ కేంద్రం సమీపంలో రెండు ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు తెలిపారు. విద్యార్థినులు ప్రాక్టికల్స్ నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే నర్సింగ్ విద్యార్థినుల వసతి కోసం తాత్కాలికంగా నోబుల్ కళాశాల సమీపంలోని కిళ్లీ, బీడీ వర్తక సంఘం భవనాన్ని కేటాయించనున్నట్టు తెలిపారు. ఆ భవనానికి మరమ్మతులు చేసి నివాసయోగ్యంగా ఆధునీకరించనున్నట్లు చెప్పారు. అలాగే ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న కొన్ని గదులను హాస్టల్ వసతి కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. ఇక్కడ నర్సింగ్ చదువుతున్న 120 మంది విద్యార్థినులు తన పిల్లలు లాంటి వారని, వారికి ఏ అసౌకర్యం కలిగినా సహించేది లేదన్నారు. విద్యార్థినుల బోధనా సిబ్బంది విషయమై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. ఫ్యాకల్టీ నిమిత్తం ఆరుగురు బోధనా సిబ్బందిని నియమించుకోమని తెలియజేస్తూ వారి పారితోషికాన్ని తాను వ్యక్తిగతంగా భరిస్తానన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులు దిశ చట్టాన్ని రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్ దాదా, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎం జయకుమార్, వైద్యులు డా. జయకుమార్, డా. అల్లాడ శ్రీనివాసరావు, డా. శ్రీనివాసాచార్యుల, మెడికల్ ఆఫీసర్ డా. మరియారోజ్, తూర్పు కృష్ణా ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు వుల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుండి ఎస్‌సీటీ కానిస్టేబుల్స్‌కు శిక్షణ
* ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 14: స్థానిక తపసిపూడిలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలోని వసతులను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన ఎస్‌సీటీ కానిస్టేబుల్స్‌తో కలిసి భోజనం చేసి మంచి నాణ్యమైన ఆహారం వారికి అందించాలని సూచించారు. మెన్ బ్యారెక్స్ చుట్టుపక్క ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. శిక్షణ పొందే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. సోమవారం నుండి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శిక్షణ ప్రారంభానికి ఏలూరు రేంజ్ డీఐజీ ఎఎస్ ఖాన్ విచ్చేయనున్నట్టు తెలిపారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, డీటీసీ సీఐ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.

ఉత్సాహంగా కృష్ణా బాలోత్సవ్
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 14: యువతలోని శక్తియుక్తులను వెలికి తీసేందుకు గాను స్థానిక హిందూ కళాశాల క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కృష్ణా బాలోత్సవ్ కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు విద్యా సంస్థలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థినీ విద్యార్థులు బాలోత్సవ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించారు. కృష్ణా, గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గ మాజీ శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు, మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ కార్యక్రమాలను ప్రారంభించారు. చిత్రలేఖనం, కథా నిర్మాణం, విచిత్ర వేషధారణలు, వక్తృత్వం, వ్యాస రచన, జానపద నృత్యాలు తదితర అంశాల్లో విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. రెండవ రోజైన ఆదివారం కూడా పోటీలు నిర్వహించనున్నట్లు కృష్ణా బాలోత్సవ్ కార్యదర్శి దేవనబోయిన వాసు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు. శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడు మానసిక ప్రశాంతత, మంచి ఆలోచనలు ఏర్పడతాయన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు చలమలశెట్టి నరసింహరావు మాట్లాడుతూ యువతలోని శక్తియుక్తులను ప్రోత్సహించడానికి బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అధ్యక్షుడు కొల్లూరి నరేష్ కుమార్ మాట్లాడుతూ చిన్నారులు యువతలో నిబిడీకృతమైన శక్తులను వెలికి తీయడానికి బాలోత్సవ్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పంచపర్వాల ప్రభాకర్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కంచర్ల కృష్ణమోహనరావు, హోల్ సేల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.