కృష్ణ

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం: రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ సీనియర్స్ విభాగం జట్టులో బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు స్థానం లభించినట్లు పాఠశాల హెచ్‌ఏం జీవీడీవీ ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల పెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బి జాన్‌మిల్టన్, కె సంజయ్ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు ఆయన చెప్పారు. తణుకులో జరుగుతున్న పోటీల్లో కృష్ణా జిల్లా జట్టుకు తమ పాఠశాల విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరిని ప్రోత్సహించిన పీడీలు చంద్రశేఖర్, నాగరాజును, క్రీడాకారులను ప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బి రమేష్, ఉపాధ్యాయుడు ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.