కృష్ణ

2న దేశవ్యాప్త సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 2వతేదీన నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె - గ్రామీణ ప్రాంత బంద్‌లో అన్ని కార్మిక సంఘాలు భాగస్వామ్యం కావాలని వామపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. సమ్మె విజయవంతం కోరుతూ గురువారం స్థానిక బస్టాండ్ సెంటరులోని బెల్ ఆడిటోరియంలో సీఐటీయు, సీఐటీసీఐఎఫ్‌టీయు న్యూ సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఇబ్బందులకు పాలు చేస్తోందన్నారు. కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. జనవరి 8వతేదీన నిర్వహించే గ్రామీణ ప్రాంత బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బంద్ విజయవంతం కోరుతూ ఈ నెల 21వతేదీ సాయంత్రం 4గంటలకు కార్మిక సదస్సు, జనవరి 5, 6 తేదీల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నరసింహరావు, ఎఐటీయుసీ జిల్లా నాయకుడు లింగం ఫిలిప్, ఎఐఎఫ్‌టీయు న్యూ నాయకుడు ఎం సుధాకర్, టి చంద్రపాల్, ఎ శ్రీనివాస్, దుర్గారావు, ఎం హరిబాబు, వై మధు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, చౌటపల్లి రవి, కె మోహన్, కెవి గోపాలరావు, గారపాటి సత్యనారాయణ, వివి రమణ, బూర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.