కృష్ణ

ఆయుష్ విభాగంలో వైద్య సిబ్బందిని నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కార్యాలయానికి గురువారం ప్రజలు చేరుకుని వివిధ సమస్యలను మంత్రి నానికి విన్నవించుకున్నారు. స్పందించిన నాని వివిధ శాఖల అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుష్ విభాగంలో వైద్య సిబ్బందిని నియమించాలని, తాత్కాలికంగా డెప్యూటేషన్‌పై అయినా ఏర్పాటు చేయాలని, ప్రజలు ఆయూష్ వైద్య సేవలందేలా చూడాలని పలువురు మంత్రిని కోరగా వైద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. బందరు మండలం చినకరగ్రహారం గ్రామానికి చెందిన వృద్ధురాలు పెనే్నరు సక్కుబాయి హృద్రోగంతో బాధపడుతున్నానని, ఆపరేషన్ నిర్వహణకు వయస్సు సహకరించదని, మందులు వాడుకోవాలని వైద్యులు చెప్పారని, మందులు కొనే సోమత లేదని మందులు ఇప్పించాలని మంత్రికి విన్నవించగా ప్రతి నెలా మందులు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో పలువురు అర్జీదారులు మంత్రిని కలిసి వైద్య చికిత్స కోసం ఆర్థికంగా సాయం అందించాలని కోరగా వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందేలా చూస్తామన్నారు. అంగన్‌వాడి కేంద్రం మా ప్రాంతానికి దూరంగా ఉండడం వలన పిల్లలు, గర్భిణీలు అక్కడకు వెళ్లలేకపోతున్నారని, అంగన్‌వాడి సేవలు వినియోగించుకోలేకపోతున్నారని దగ్గరగా ఏర్పాటు చేయాలని స్థానిక డ్రైవర్స్ కాలనీ, గుమస్తాల కాలనీ వాసులు మంత్రికి మొరపెట్టారు.

వాలీబాల్, టెన్నికాయిట్‌లో లేడియాంప్తిల్ విద్యార్థుల ప్రతిభ
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 12: జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల క్రీడా పోటీల్లో స్తానిక లేడియాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు వాలీబాల్, టెన్నికాయిట్‌లో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను కళాశాల అభివృద్ధి కమిటీ, అధ్యాపక బృందం గురువారం అభినందించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, కళాశాల ప్రిన్సిపాల్ వి రాకేష్ కుమార్ పాల్గొని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.
రేపు జిల్లాలో జాతీయ లోక్ ఆదాలత్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 12: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 14న జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి భీమారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జి ల్లా న్యాయస్థానంతో పాటు గుడివాడ, నూజివీడు, నందిగామ, విజయవాడ, గ న్నవరం, అవనిగడ్డ, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, బంటుమి ల్లి, ఉయ్యూరు, మొవ్వ న్యాయస్థానాల్లో లోక్ ఆదాలత్‌లు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.