కృష్ణ

ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్యుడిపై వెయ్యి కోట్ల భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి చార్జీల పెంపుదల వల్ల సామాన్యుడిపై వెయ్యి కోట్ల రూపాయల భారం పడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసి చార్జీలకు నిరసగా బుధవారం విజయవాడ నుండి మైలవరం వరకూ, మైలవరం నుండి విజయవాడ వరకూ సామాన్య ప్రయాణికుని వలే ఆర్టీసి బస్సులో ప్రయాణించారు. ఈసందర్భంగా మైలవరం ఆర్టీసి బస్టాండ్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సామాన్యుడిని తన పాలన ద్వారా ఇబ్బందులకు గురి చేయటమే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి లక్ష్యంగా తెలుస్తోందని ధ్వజమెత్తారు. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడు జీవించలేని పరిస్థితిలో ఉండగా ఆర్టీసి చార్జీలను కూడా పెంచి కోలుకోలేని స్థితికి తెచ్చాడని జగన్‌పై విరుచుకుపడ్డారు. నిత్యావసర వస్తువులను నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వం గద్దెదిగాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు స్వర్గం చూపుతానని చెప్పి నేడు నరకం చూపుతున్నాడని ఎద్దేవా చేశారు. పెంచిన ఆర్టీసి చార్జీలను బేషరతుగా విరమించుకోవాలని ఉమా డిమాండ్ చేశారు. రైతుబజార్‌లో కిలోమీటర్ల పొడవునా ఉల్లికోసం క్యూ కట్టారన్నారు. సమస్యలపై మాట్లాడితే స్వయంగా మంత్రులే ప్రతిపక్ష నేతపై బూతులు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఉచితంగా దొరికే ఇసుకను వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి స్థానిక నేతలు పాల్గొన్నారు.
వైభవంగా ఆలయ శిఖర ప్రతిష్ఠ
తోట్లవల్లూరు, డిసెంబర్ 11: మండలంలోని రొయ్యూరు గ్రామంలోని శ్రీసకలేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా ఆలయ శిఖర ప్రతిష్ఠ బుధవారం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఆలయ అధికారుల సహకారంతో ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగిందని మాజీ జడ్పీటీసీ సభ్యుడు మోర్ల రామచంద్రరావు, లుక్కా వెంకట శ్రీనివాసరావుతెలియజేశారు.

జాతీయ తైక్వాండో పోటీలకు ఎల్‌హెచ్‌ఆర్ విద్యార్థుల ఎంపిక
మైలవరం, డిసెంబర్ 11: జాతీయ స్థాయిలో జరగబోయే తైక్వాండో పోటీలకు మైలవరం ఎల్‌హెచ్ రెడ్డి జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఎంపికయ్యారు. ఇటీవల కపడ జిల్లా రైల్వే కోడూరులో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలలో తమ స్కూల్‌కు చెందిన బి నాగరోహిణి (బంగారు పతకం), ఎస్ సానియా (బంగారు పతకం), ఎం శైలజ (బంగారు పతకం), ఎం శిరీష (రజిత పతకం) అనే ముగ్గురు విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం రవిప్రకాష్ బుధవారం తెలిపారు. వీరు ఈనెల 14న మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొంటారని తెలిపారు. విజేతలను వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామోపాధ్యాయులు కె వెంకయ్య, జి మెర్సీరెజీనాలను హెచ్‌ఎం, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

భక్తిశ్రద్ధలతో పైడమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం
పెడన, డిసెంబర్ 11: పదకొండు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న శ్రీ పైడమ్మ అమ్మవారి సంబరాలు బుధవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలకు జిల్లా వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. బుధవారం అమ్మవారు అలంకరణ కోసం బందరు వెళ్లగా గురువారం ఉదయానికి ఆలయానికి చేరుకోనున్నారు. ఇప్పటికే ఉత్సవాల నిర్వహణ కోసం మున్సిపల్, పోలీసు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ పైడమ్మ అత్తింటి వారైన దాసు, పుట్టింటి వారైన తోట వంశీకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంబరంలో సిడి బండ్లు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. ఆలయ ఇఓ జోగి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వంశీకులు తోట ముసలయ్య, తోట పైడియ్య, తోట వెంకన్న తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.