కృష్ణ

ఏసీబీ దాడులపై విచారణ చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకూ జరిగిన ఏసీబీ దాడులు 1224 జరిగాయని, ఇవి ఉద్దేశ్యపూర్వకంగా చేయించారా లేక ఇతర కోణాల్లో చేశారా అన్న అంశంపై విచారణ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో వెన్నపూస గోపాల రెడ్డి, జంగా కృష్ణమూర్తి తదితరులు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి తరపున మంత్రి కన్నబాబు మంగళవారం సమాధానం చెప్పారు. ఏసీబీ డీజీగా ఠాకూర్ పని చేసిన సమయంలో అధికారులను ఉద్దేశ్యపూర్వకంగా వేధించారని, ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపైనే కేసులు నమోదైనట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీని నియమించామని, విచారణ చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన ఇళ్లు, పార్కులు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయన్నారు. ఇందుకు సంబంధించి ఒక ఫిర్యాదు అందిందని, పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులా?
వివిధ ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడాన్ని పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలపై సభ్యులు చల్లా రామకృష్ణారెడ్డి, తిప్పేస్వామి, దువ్వారపు రామారావు ప్రశ్న అడిగారు. టీడీపీ సభ్యుడు బిటి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రామారావు ఆరోపించారు.
విశాఖలో కాలుష్యం
దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో విశాఖ నగరం ఉందని టీడీపీ సభ్యుడు బుద్దా నాగ జగదీశ్వర రావు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ప్రజలు వాయు కాలుష్యంతో బాధపడుతున్న విషయం నిజమేనా అంటూ ప్రశ్నించారు. వివిధ విద్యుత్ కంపెనీల పరిసరాలు, చమురు సంస్థల వల్ల విశాఖ, పరిసర గ్రామాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందన్నారు. మంచు లేదా మబ్బు పట్టిన సందర్భంలో హెచ్‌పీసీఎల్ నుంచి విడుదల అయ్యే టీపీసీ అని వ్యవహరించే కర్బనాలు పైకి వెళ్లకుండా కిందనే ఉండిపోతున్నాయన్నారు. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, ఆ సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలుష్య కారక పరిశ్రమల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి బాలినేని సమాధానం ఇస్తూ, విశాఖకు సంబంధించి సెపి (కాంప్రహెన్సివ్ ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్) స్కోరు 2004లో 70.82 ఉండగా, 2013లో అది 50.32కు తగ్గిందన్నారు. 2018లో అది 44.7కు తగ్గిందని, దీంతో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితా నుంచి విశాఖను తొలగించారని వివరించారు.