కృష్ణ

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): ఉపాధ్యాయ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని కృష్ణా, గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై బుధవారం యుటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ప్రారంభించిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2018 నియామకాల విషయంలో నెలకొన్న న్యాయ వివాదాలను పరిష్కరించి నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు. నియామకాలు చేపట్టే లోపు అకడమిక్ ఇన్‌స్ట్రెక్టర్లను నియమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్‌గ్రేడ్ చేసిన ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించాలని, సంక్రాంతి శెలవుల్లో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ధర్నా శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా విద్యా శాఖ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జె లెనిన్ బాబు అధ్యక్షతన జరిగిన ధర్నాలో గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి ఎస్‌పి మనోహర్, సహాయ అధ్యక్షుడు సీతారామయ్య, కె భగీరధి, రాష్ట్ర కౌన్సిలర్లు కెఎ ఉమామహేశ్వరరావు, లీల తదితరులు పాల్గొన్నారు.