కృష్ణ

‘పోర్టు’కు ‘రైట్’ రైట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: తీరని కలగా మారిన బందరు ఓడరేవు నిర్మాణ పనుల ప్రారంభ దిశగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు గత ఆరు నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగంగా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత వారం రోజుల క్రితం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి నేతృత్వంలో కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పోర్టు నిర్మాణానికి అవసరమైన వౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణ అంశంపై చర్చించారు. సుమారు రూ.4వేల కోట్లను కెనరా బ్యాంక్‌తో పాటు ఇతర బ్యాంక్‌ల నుండి తీసుకోనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బందరు ఓడరేవు నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన మైథాస్ ఆర్థిక సంక్షోభానికి గురి కావటం, ఆ తర్వాత రాజశేఖరరెడ్డి అకాల మరణంతో కొణిజేటి రోశయ్య నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోర్టు నిర్మాణ బాధ్యతలను నవయుగ సంస్థకు అప్పగించారు. అయితే నవయుగ సంస్థ ఓడరేవు నిర్మాణానికి ముందుకు రాలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఓడరేవు నిర్మాణానికి అస్కారం లభించలేదు. అవసరానికి మించి భూసేకరణకు గత టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించటంతో ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములను సైతం కూడా సేకరించలేకపోయారు. నాడు బాధిత రైతులకు అండగా నిలిచిన జగన్మోహనరెడ్డి పలు పర్యాయాలు మచిలీపట్నం వచ్చి భూదోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజా సంకల్ప యాత్ర, ఎన్నికల ప్రచార సభలో సైతం పోర్టుపై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నవయుగ సంస్థను పోర్టు బాధ్యతల నుండి తప్పించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పోర్టును నిర్మిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైట్స్ ఇంజనీరింగ్ కంపెనీకి ఓడరేవు నిర్మాణానికి అవసరమైన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారీ బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ జనవరిలో డీపీఆర్‌ను అందించాల్సి ఉంది. డీపీఆర్ అందిన వెంటనే అదే సంస్థ ద్వారా ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది.
కొత్త సంవత్సరంలో పోర్టు
పనులు ప్రారంభం : మంత్రి పేర్ని నాని
రానున్న కొత్త సంవత్సరం 2020లో ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సోమవారం పెడనలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. పోర్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న నవయుగ సంస్థ ఉద్దేశ్యపూర్వకంగా గడిచిన 11 సంవత్సరాలుగా పోర్టు నిర్మాణానికి ముందుకు రాలేదన్నారు. ఫలితంగా సదరు సంస్థను నిర్మాణ బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైట్స్ ఇంజనీరింగ్ కంపెనీకి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ జనవరిలో డీపీఆర్ అందించాల్సి ఉండగా డిసెంబర్ నెలాఖరు నాటికే అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కోరారన్నారు. డీపీఆర్ అందిన వెంటనే కొత్త సంవత్సరంలో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీ వ్యాధిగ్రస్తులకు జీవన భృతి చారిత్రాత్మకం
* మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, డిసెంబర్ 2: డా. వైఎస్‌ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చికిత్సానంతరం జీవనోపాధి భృతి అందించడం చారిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటైన డా. వైఎస్‌ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవనభృతి పథకాన్ని సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌తో కలిసి ఈ పథకం అర్హులైన వారికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రతి పేద వాడికి కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చిన ఘనుడు దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి జీవనభృతి కల్పించిన ఘనుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రిలో చేరిన ప్రతి పేదవాడికి 1059 వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. కన్సల్టేషన్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శస్తచ్రికిత్సలు, మందులు ఉచితంగా అందించటంతో పాటు డిశ్చార్జ్ సమయంలో ఆస్పత్రి నుండి ఇంటికి రవాణా ఖర్చులు కూడా పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. డిశ్చార్జి అయ్యాక వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి అవసరమైన ప్రతి పేదవాడు కొలుకునే వరకు వారి జీవనోపాధి కోసం 836 వ్యాధులకు రోజుకు రూ.225లు చొప్పున గరిష్టంగా రూ.5వేలు అందజేయడం జరుగుతుందన్నారు. డిశ్చార్జ్ అయిన 48గంటల్లోగా ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.300కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయనుందని తెలిపారు. 5లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖాజావలి, డీసీహెచ్‌ఎస్ డా. జ్యోతిర్మణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎం జయకుమార్, డా. అల్లాడ శ్రీనివాసరావు, డా. వినయ్ కుమార్, ఎఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, మాజీ కౌన్సిలర్ అచ్చాబా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్ తదితరులు పాల్గొన్నారు.

ఆలోచనల పెంపు దిశగా విద్యార్థులు
అడుగులు వేయాలి
* జిల్లా శాస్ర్తియ, వైజ్ఞానిక ఎగ్జిబిషన్‌లో మంత్రి పేర్ని నాని
పెడన, డిసెంబర్ 2: వైజ్ఞానిక ప్రదర్శనలతో తమ సృజనాత్మకతను ఆపోద్దని, ఆలోచనలకు పెంపుదల చేసుకుంటూ ముందడుగు వేయాలని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విద్యార్థులకు సూచించారు. స్థానిక సెయింట్ వినె్సంట్ పల్లోటి హైస్కూలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా శాస్ర్తియ, వైజ్ఞానిక ఎగ్జిబిషన్ సోమవారం పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్, జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పేర్ని మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా ముందుకు పోతుందన్నారు. ఆ ఆలోచనలకు ముందుగా పాఠశాలల్లోనే వేర్లు, పునాదులు ఉన్నాయన్నారు. పుస్తకాల్లో పాఠాలు చదివి విని గ్రహిస్తే సరిపోదని, విజ్ఞానం, ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు నడవాలన్నారు. మానవ అవసరాల కోసం తమ ఆలోచనలను, విజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ గుండుసూది తయారు చేసుకునే స్థితి నుండి నేడు అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపే స్థాయికి భారతదేశం చేరుకుందన్నారు. అన్ని రంగాల్లో ముందుడుగు వేసి రానున్న సంవత్సరాల్లో ప్రపంచ స్థాయిలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందన్నారు. పోటీతత్వానికి విద్యార్థులు నిలబడేలా రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ బోధనను పాఠశాలల్లో వచ్చే ఏడాది నుండి ప్రవేశ పెడుతుందన్నారు. తెలుగును బోధిస్తూనే ఆంగ్ల భాషా బోధన కూడా అమలవుతుందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో 17 శాతం నిధులను ప్రభుత్వం విద్యకు ఖర్చు చేస్తోందన్నారు. ఆలోచనాపరులు అనేక ఉంది ఉన్నారని, వారంతా తమ ఆలోచనలను బయటకు తీయాలన్నారు. తరగుతున్న అడవులు, ఇంకిపోతున్న భూగర్భ జలాలు, వర్షం లేక ఎండిపోతున్న నదులు తదితర వాటినన్నింటిలో విద్యార్థులు విజ్ఞానంతో మార్పు తీసుకురావాలన్నారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ బాల్యంలోనే ప్రశ్నలు వేసే గుణం ఆగకుండా కాటికి వెళ్లేటప్పటికి కూడా సందేహాలు మనిషిలో కొనసాగాలన్నారు. సైంటిఫిక్ టెంపర్ విద్యార్థుల్లో ఒక అభరణం కావాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణకు 150 ప్రదర్శనలు రాలేదని తిరస్కరించిన జిల్లా నేడు 700 ప్రాజెక్ట్‌లు వచ్చిన జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచిందన్నారు. బాల మేధావులు, యువ మేధావులు తయారు చేసిన తమ ప్రదర్శనలకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా అవార్డులు దక్కాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖాజావలి, ఉప విద్యా శాఖాధికారులు బత్తిన సత్యనారాయణమూర్తి, చంద్రకళ, హైస్కూలు కరస్పాండెంట్ జోజిరెడ్డి, ఎంపీడీవో రామనాథ్, తహశీల్దార్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.