కృష్ణ

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 14వతేదీన ప్రారంభమైన వారోత్సవాలు 20వతేదీతో ముగియనున్నట్లు తెలిపారు. 20వతేదీన విజయవాడలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాలలందరికీ జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కు కలిగి ఉన్నాయన్నారు. అనంతరం బాలల సమాచారం త్రైమాసిక పత్రిక ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, డీఆర్‌ఓ ప్రసాద్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భార్గవి, ఆర్డీవో ఖాజావలి, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అభయాంజనేయుని సేవలో
మాజీ సీఎం చంద్రబాబు
హనుమాన్ జంక్షన్, నవంబరు 18: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. సోమవారం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన వెళుతూ ఆయన హనుమాన్ జంక్షన్ కూడలిలో ఆగారు.