కృష్ణ

ప్రకృతి సేద్యమే ఆరోగ్యదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్: దేశంలోని రైతులంతా ప్రకృతి సేద్యం చేయడం ద్వారా ఆరోగ్య భారత్‌కు బాటలు వేయవచ్చని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మైనేని గణేష్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని అయన అదివారం సందర్శించారు. సాగు విధానంలో రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, మెలకువలను అడిగి తెలుసుకున్నారు. విదేశాలలో స్థిరపడి స్వదేశంపై మక్కువతో స్వగ్రామాల్లోనే వ్యవసాయం చేస్తున్నారనే విషయాన్ని అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు. విదేశంలో ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామంలో ప్రకృతి సాగు చేస్తున్న మైనేని గణేష్‌ను గవర్నర్ అభినందించారు. అనంతరం రైతులు, డ్వాక్రా మహిళలతో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గవర్నర్ సమక్షంలో ప్రకృతి వ్యవసాయ సాగు చేస్తున్న పలువురు రైతులు వారి అనుభావాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అధికారులు రైతులకు, గవర్నర్‌కు వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాగు చేస్తున్న మొవ్వా రామారావును కూడా గవర్నర్, కలెక్టర్, సబ్ కలెక్టర్ ఘనంగా సత్కరించారు. అనంతరం గవర్నర్ మొక్క నాటారు. దాదాపు గంటన్నర పాటు గవర్నర్ పర్యటన సాగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ కమిటీ సభ్యుడు డా. దుట్టా రామచంద్రరావు, నీటి సంఘాల నాయకుడు ఆళ్ళ గోపాలకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కేశవరెడ్డి, వ్యవసాయ శాఖ మండల అధికారిణి భవాని, బాపులపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు మంజూష, తదితరులు పాల్గొన్నారు.