కృష్ణ

వరి కోత.. కూలీల మోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల: మండలంలో మరికొద్ది రోజులలో రైతులు వరి కోతలు ప్రారంభించనున్నారు. ఖరీఫ్ సాగు ఈ ఏడాది సాఫీగా జరిగిందని, పంట కూడా ఆశాజనకంగా ఉందని, కానీ కూలీ రేట్లు పెరుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు నెలలు నుంచి కూలీలకు పని లేకుండా ఉంది. వరి నాట్లు పూర్తయిన తరువాత కలుపులు అనంతరం పనులు ఉండవు. ఈ సమయంలో వరి కోతలకు ముందస్తుగా రైతులు నుంచి సొమ్ము తెచ్చుకుంటారు. దీంతో కూలీల కొరత లేకుండా రైతులు అడ్వాన్స్‌లు ఇస్తుంటారు. పమిడిముక్కల, మొవ్వ మండలాల రైతులు వరి కోతలకు శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుంచి బత్తెపు కూలీలను రప్పిస్తుంటారు. కాగా ప్రస్తుతం కోడూరు, నాగాయలంక, మోపిదేవి నుండి ఆటోలలో కూలీలు వచ్చి మగతా మాట్లాడుకుని కోతలు కోస్తారని రైతులు చెబుతున్నారు.

వల్లూరుపాలెంలో కోలాహలంగా ఎడ్ల ప్రదర్శన
తోట్లవల్లూరు,నవంబర్ 17: మండలంలోని వల్లూరుపాలెంలో రైతులు కోలాహలంగా ఆదివారం ఎడ్ల ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ నాయకుడు జగన్‌పోతురాజు ఆధ్వర్యంలో ఎడ్ల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రైతులు ఎడ్లను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించారు.