కృష్ణ

భక్తుల భద్రతకే తొలి ప్రాధాన్యం - జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానాల నిమిత్తం మంగినపూడి బీచ్‌కు వచ్చే భక్తుల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. మంగళవారం జరగనున్న సముద్ర స్నానాలకు 2లక్షల మంది భక్తులు మంగినపూడి బీచ్‌కు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. పోలీసు శాఖ కూడా ఆ దిశగా భద్రతా చర్యలు చేపట్టిందని తెలిపారు. సోమవారం ఆయన మంగినపూడి బీచ్‌ను సందర్శించి పోలీసు శాఖ చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ భక్తులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లి స్నానం చేయకుండా ఉండేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మత్స్య శాఖాధికారుల సహకారంతో గజ ఈతగాళ్లను, బోట్ల ద్వారా మెరైన్ సిబ్బందిని గస్తీ పెట్టామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట మెప్మా పీడీ జివి సూర్యనారాయణ, మత్స్య శాఖ డీడీ సురేష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ఎస్‌బీ సీఐ చంద్రశేఖర్, సీసీఎస్ సీఐ సుబ్బారావు, రూరల్ సీఐ కొండయ్య తదితరులు ఉన్నారు.

నివేశన స్థల దరఖాస్తుల తిరస్కరణపై మంత్రి పేర్ని మండిపాటు

మచిలీపట్నం, నవంబర్ 11: నివేశన స్థలాలకు సంబంధించి తిరస్కరణకు గురైన దరఖాస్తులను పునః పరిశీలన చేయమని ఆదేశించినా జరపరని అధికారులపై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని రుద్రవరం గ్రామ పంచాయతీ కృష్ణారావుపేట గ్రామంలో 26 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ భూ కొనుగోలు పథకం ద్వారా 23 ఎకరాల 75 సెంట్ల సాగు భూమిని సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు నివేశన స్థలాలు మంజూరు కాలేదని మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకు వచ్చారు. గ్రామంలో నివేశన స్థలాల కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, వారిలో అర్హులు ఎంత మంది అనే విషయాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి అర్హుల జాబితా తయారు చేయాలని వీఆర్‌ఓ, గ్రామ వలంటీర్లను గతంలో ఆదేశించామని, అయినప్పటికీ కొంత మంది దరఖాస్తులు తిరస్కరించడం పట్ల మంత్రి పేర్ని మండిపడ్డారు. తిరస్కరించిన అర్జీలను మరలా పరిశీలించి అర్హతను బట్టి వారిని జాబితాలో చేర్చాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా గృహాలు లేని వారికి నివేశన స్థలాలు లేదా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు ఇవ్వనుందని తెలిపారు. పంచాయతీ రాజ్ అధికారులు గ్రామంలో సర్వే చేసి నిర్మించాల్సిన సీసీ రోడ్లను గుర్తించి వ్యయం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించే విధంగా ఇప్పటి నుండే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో విద్యుత్ అధికారులు సర్వే చేసి అవసరమైన చోట కొత్త విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు, వలంటీర్లు నిబంధనల మేరకు వివిధ పథకాల అర్హుల జాబితాలు తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సునీల్, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.