కృష్ణ

కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబర్ 12వతేదీన మంగినపూడి బీచ్ వద్ద జరగనున్న సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అధికారులను ఆదేశించారు. సముద్ర స్నానాల ఏర్పాట్లపై బుధవారం ఆయన విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌తో పాటు జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సముద్ర స్నానాలకు వచ్చే ఏ ఒక్క భక్తుడు అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు సముద్ర స్నానాలకు వచ్చే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) వైస్ చైర్మన్ విల్సన్ బాబు చీఫ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. నిర్వహణ భారమంతా అధికార యంత్రాంగం మీద వేసుకోవద్దని సూచించారు. నిర్వహణలో స్వచ్చంద సంస్థలను భాగస్వాములను చేయాలన్నారు. సముద్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 400 లైట్లు, విధుల్లో ఉండే పారిశుద్ధ్య సిబ్బందికి జాకెట్లు, వలంటీర్లకు టీ షర్ట్స్‌ను తాను వ్యక్తిగతంగా సమకూరుస్తానన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ వారి ద్వారా విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు, సిబ్బందికి భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. చిన్న పిల్లలకు పాలు, ట్యాగ్‌లను ఎన్‌జీఓల ద్వారా సమకూర్చాలన్నారు. సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను 20 పడవలతో అవసరం మేర గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. రెండు షిఫ్టులుగా వీరి సేవలను వినియోగించుకోవాలన్నారు. వీరికి అదనంగా ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. ఐదు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించటంతో పాటు అత్యవసర సేవల వినియోగానికి 108 అంబులెన్స్‌లు, ప్రైవేట్ అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గత ఏడాది భక్తుల సౌకర్యార్ధం 35 ఆర్టీసీ బస్సులు నడిపారని, ఈ సంవత్సరం ఆ సంఖ్యను 50కు పెంచాలన్నారు. ట్రాఫిక్‌కు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలన్నారు. మచిలీపట్నం నుండి బీచ్ రోడ్డు వరకు వన్ వే ట్రాఫిక్‌ను అమలు చేయాలన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 9వతేదీన చిలకలపూడి పాండురంగ స్వామి రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి పేర్ని తెలిపారు. పాండు రంగ స్వామి ఆలయం వద్ద కూడా భక్తులకు అవసరమైన మేర సౌకర్యాలు కల్పించాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. బీచ్ వద్ద చిన్న పిల్లలో సంరక్షణతో పాటు వారి సెల్ నెంబర్లకు జియోట్యాగింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట ఆర్‌అండ్‌బీ ద్వారా బ్యారికేడింగ్ చేయాలన్నారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను బీచ్ వరకు తీసుకువెళ్లేందుకు గాను 10 టాటా మ్యాజిక్ వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో ఈ నెల 28వతేదీన కలెక్టర్ నేతృత్వంలో అధికారులు పర్యటించి అవసరమైన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తామన్నారు. అవసరమైతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామన్నారు. ఈ సమావేశంలో జేసీ-2 మోహన్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ముడా వీసీ విల్సన్‌బాబు, ఎస్‌డీసీ ఎం చక్రపాణి, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, జెడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు, డీపీఓ డా. అరుణ, మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో జివి సూర్యనారాయణ, దేవాదాయ శాఖ ఏడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణానదికి మళ్లీ వరద
జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 23: తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీ వరద వచ్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిన క్రమంలో ఈ ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో మండల పరిధిలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలైన ముక్త్యాల, రావిరాల, వేదాద్రిలో బుధవారం ఉదయం నుండి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉద్ధృతంగాప్రవహిస్తోంది. ముక్త్యాలలో నది ఒడ్డున గల శివాలయం, సిమెంట్ కర్మాగారాలకు చెందిన మంచి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ స్తంభాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రావిరాలలో కృష్ణా నది వరద పెరగడంతో మత్స్యకారులు చేపల వేట మానుకుని పడవలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకున్నారు. వేదాద్రిలో నదీ గర్భంలోని సాల నీటిలో మునిగిపోగా పుష్కర ఘాట్‌ల మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. కృష్ణా నదికి భారీగా వరద వచ్చిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీరు పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.