కృష్ణ

ప్లాస్టిక్‌ను నిషేధించడం కాదు, మన ప్రవర్తనలో మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్లాస్టిక్ హాని చేస్తుందని దానిని నిషేధించడం కంటే మనిషి ప్రవర్తన, విధానంలో మార్పు వస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ శాఖ కార్యదర్శి పి రాఘవేంద్రరావు అన్నారు. గురువారం గన్నవరంలో కేంద్ర ప్రభుత్వ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ శాఖ మంత్రి చేతుల మీదుగా సిపెక్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకు వచ్చిన ఆయన బుధవారం మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వాసి అయిన ఆయన కుటుంబ సమేతంగా అతి పురాతనమైన కలెక్టరేట్‌ను సందర్శించారు. మచిలీపట్నంతో ఆయనకున్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. తాను పుట్టింది ఇక్కడేనన్నారు. తన తండ్రి జిల్లా ట్రజరీ అధికారిగా కలెక్టరేట్‌లోనే పని చేశారన్నారు. ప్లాస్టిక్‌ను ఎక్కడ పడితే అక్కడ వాడి పారేయడం వల్ల మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం కస్టమ్స్ డ్యూటీని బాగా పెంచిందన్నారు. కెమికల్ విధానం నుండి బయో విధానానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ, బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్స్, పెస్టిసిడ్స్ వాడకం వైపు విధానం మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రో కెమికల్స్ దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నామని, ఇంపోర్ట్ తగ్గించి ఎక్స్‌పోర్ట్ చేయగలగాలన్నారు.

వేరుశెనగ రైతుల ఆశలపై నీళ్లు చల్లిన వర్షాలు
* గోపువానిపాలెం, మేకావానిపాలెంలో భారీ పంట నష్టం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేరుశెనగ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. అల్పపీడన ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలకు వేరుశెనగ పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. బందరు మండలం గోపువానిపాలెం, మేకావానిపాలెం తదితర గ్రామాల్లో రైతులు వేలాది ఎకరాల్లో వేరుశెనగ సాగు చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ కలిగించిన వేరుశెనగ పంట ఈ విడత లాభదాయకంగా ఉంటుందనుకుంటున్న తరుణంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వేరుశెనగ పంటలోకి వర్షపునీరు చేరటంతో పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలో నిల్వ ఉన్న వర్షపునీటిని బయటకు తోడేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.