కృష్ణ

రాతి క్వారీలలో తవ్వకాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల: కంచికచర్ల మండలం పరిటాల కొండపల్లి రిజర్వ్ పారెస్ట్ అంచున ఉన్న 34 రాతి క్వారీలలో తవ్వకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దొనబండ, గొట్టెముక్కల మధ్యన పరిటాల పరిధిలో 34 రాతి క్వారీలు, 50కు పైగా క్రషర్‌లు ఉన్నాయి. రెండు దశబ్దాలకు పూర్వం ఈ క్వారీలలో శ్రీకాకుళం ఏరియా నుండి కూలీలను తీసుకువచ్చి సుత్తులతో రాళ్లు కొట్టేవారు. సాంకేతికంగా అభివృద్ధి చెందటంతో ట్రాక్టర్ల ద్వారా కొండపై 200 అడుగుల లోతుకు పైగా బోర్లు వేసి వాటిలో పేలుడు పదార్థం ఉంచి పేలుడు జరిపేవాపారు. దీనివలన 3 టన్నుల లోపు రాళ్లు లేచి పడేవి . ఇందుకు అనుగుణంగా గతంలో ఉన్న చిన్న క్రషర్లను మార్చి 3 టన్నుల రాయిని కూడా పగలగొట్టగల సామర్ధ్యం ఉన్న క్రషర్లను ఏర్పాటు చేశారు. గతంలో కూలీలకు డబ్బులు ఇవ్వకపోవటంతో 15 సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్‌గా ఉన్న నవీన్ మిట్టల్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వారీలలో కూలీలకు కనీస సౌకర్యాల కోసం కృషి చేశారు. కొందరు కూలీలు పని ఒత్తిడి తట్టుకోలేక పోలీసుల సహకారంతో తమ గ్రామాలకు తరలి వెళ్లారు. దీంతో క్వారీ యజమానులు భారీ పేలుళ్లు ప్రారంభించారు. ఈ పేలుళ్ల వలన కాచవరం (దొనబండ) పరిటాల, గొట్టుముక్కల గ్రామాలలో ఇళ్లు పగుళ్లు ఇవ్వటమే కాక తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయి. దీనిపై ఈ గ్రామ ప్రజలు అనేకసార్లు మొర పెట్టుకొన్నా ఏడాది ముందు వరకు అధికారులు పట్టించుకోలేదు. తర్వాత బందరు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిభందనల ప్రకారం 30 అడుగులకు మించి లోతు తవ్వరాదని, భారీ పేలుల్లు జరపరాదని ఉత్తర్వులు ఇచ్చింది. అయినా నిన్నటి వరకు క్రసర్ యాజమానులు తమ క్వారీలలో భారీ పేలుళ్లు జరుపుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన గనుల శాఖ రాతి క్వారీల దగ్గర విచారణ జరిపింది. క్వారీల దగ్గర నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకుండా, పరిజ్ఞానం లేని వ్యక్తులతో పేలుల్లు జరుపుతున్నారని ప్రభుత్వానిక నివేదిక ఇచ్చింది. దీనిపై ఈ ప్రాంతంలో ఉన్న 34 క్వారీలలో తక్షణమే తవ్వకాలు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.