కృష్ణ

డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించే డ్వాక్రా గ్రూపులకు వడ్డీలేని రుణ సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు తెలిపారు. బుధవారం స్థానిక ఎస్‌బీకె విజ్ఞాన భవనంలో డీఆర్‌డీఎ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో స్వయం సహాయక సంఘాలకు మెగా రుణ మేళా కార్యక్రమాన్ని సింహాద్రి ప్రారంభించి ప్రసంగించారు. ఈ నిర్ణయంతో డ్వాక్రా సంఘాలు కూడా కొత్త రుణాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని, డ్వాక్రా సంఘాలు రుణాలు గతంలో విజయవాడకు బస్సులలో తరలించి అందించేవారని, ప్రస్తుతం ఆ దుస్థితి లేదన్నారు. వరదల వల్ల మాత్రమే ఇసుక కొరత ఏర్పడిందని, చంద్రబాబు హయాంలో వరదలు లేకపోవటం, ఇసుకను నిలువుదోపిడీ చేయటం జరిగిందన్నారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. గత పాలకుల తప్పిదాల వల్లనే పంట పొలాలు, గృహాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. డ్వాక్రా సంఘాలకు ప్రతి నెలా రూ.106 కోట్ల రుణాలు అందించటం జరుగుతుందని, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ పథకాలు విజయవంతం అవుతున్నాయన్నారు. గతంలో మద్యం ఆదాయంపై ప్రభుత్వాలు మనుగడ సాగించగా ప్రస్తుతం నిషేధం దిశగా అడుగులు వేయటం, గుట్కా, ఖైనీలను నిషేధించటం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. గాంధీజీ ఆశించిన స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా 801 డ్వాక్రా గ్రూపులకు రూ.34.20 కోట్ల రుణాలు అందించగా శ్రీనిధి కింద 2955 లబ్ధిదారులకు రూ.12.18 కోట్లు అందచేయటం జరుగుతోందన్నారు. రుణాలు పక్కదోవ పట్టకుండా అర్హులకు రుణాలు ఇస్తున్నామని, గతంలో నకిలీ రుణాలు ఇచ్చారని తెలిపారు. రూ.2002 కోట్ల రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు అంచెలంచెలుగా అమలు చేయటం జరుగుతుందన్నారు. ఈ సభకు డీఆర్‌డీఎ పీడీ ఎం శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షురాలు వెంకట కుమారి, కె నరసింహారావు, రేపల్లె శ్రీనివాసరావు, భోగాది శేషగిరిరావు, వేమూరి వెంకట్రావు, ఎంపీడీఓ లక్ష్మీకుమారి, ఏపీఎం పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.