కృష్ణ

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని నూజివీడు సబ్‌కలెక్టరు స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఈనెల 24న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీపెట్ కార్యాలయంలో డీసీపీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి సబ్‌కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ 24 ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్, కేంద్ర మంత్రి సదానందగౌడ్‌తో కలిసి విచ్చేస్తారని అన్నారు. సీపెట్ నూతన భవన సముదాయాన్ని వారివురు లాంఛనంగా ప్రారంభించనున్నారని చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా పూర్తిస్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన పరిసర గ్రామాల్లో కూడా భద్రతాచర్యలు తీసుకోవాలని చెప్పారు. సభాస్థలి ప్రాంతాన్ని సబ్‌కలెక్టరు, డీసీపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయరాణి, అదనపు డీసీపీ నాగరాజు, సీఫెట్ డైరెక్టరు కిరణ్‌కుమార్, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వరరావు, గన్నవరం తహశీల్దార్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.