కృష్ణ

దేశ వ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆల్ ఇండియా బ్యాంకర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఇఎఫ్‌ఐ, బీఇఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశ వ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల ఒక రోజు సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రాబ్యాంక్ ఫౌండర్స్ బ్రాంచ్ వద్ద విలీన ప్రక్రియను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు, ఎఐటీసీ నాయకుడు హనుమంతరావు, ఎల్‌ఐసీ రిటైర్డ్ ఎంప్లారుూస్ నాయకులు ఎస్ ధనుంజయ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొడాలి శర్మ, సీపీఐ నాయకుడు వెంకన్న బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంక్ అవార్డ్ ఎంప్లారుూస్ యూనియన్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ యడ్ల దుర్గారావు మాట్లాడుతూ విలీన ప్రక్రియ వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంక్‌ల సేవలు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. చాలా బ్యాంక్ బ్రాంచ్‌లను మూసి వేయటం జరుగుతుందని, దీన్ని ప్రజలంతా తీవ్రంగా ప్రతిఘటించాలని కోరారు. ఎల్‌ఐసీ ఎంప్లారుూస్ యూనియన్ కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ బ్యాంక్‌లలో పెద్ద పెద్ద పారిశ్రామికులు అప్పులు తీసుకుని ఎగవేసి విదేశాలకు పారిపోయినా వారిపై చర్యలు తీసుకోని ప్రభుత్వం ప్రజల మనస్సులను మరల్చడానికికే విలీనానికి పూనుకుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేశారు.

అమరావతిలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలి
* గవర్నర్‌కు సామాజిక కార్యకర్త కంచర్ల వినతి
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 22: రాష్ట్ర రాజధాని అమరావతిలో రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కంచర్ల శివరామ ప్రసాద్ కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ నుండి రాష్ట్రం విడిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయకపోవటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రజా ప్రయోజనార్థం అమరావతిలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.