కృష్ణ

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల పాత్రే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల పాత్రే కీలకమైనదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో వివిధ రంగాలకు చెందిన ప్రజలు, ప్రజా సంఘాలు, వ్యాపారవేత్తలు, కార్మిక, విద్యార్థి వర్గాలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా పోలీసు శాఖ అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి సమాజ హితం కోరే విధంగా అభిప్రాయాలు, అర్ధవంతమైన చర్చలు నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పోలీసు శాఖ పని చేస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు ఇచ్చే విలువైన సూచనలు, సలహాలను గౌరవిస్తామన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా పోలీసు శాఖ కార్యకలాపాలు ఉంటాయన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ముందుండేది పోలీసులేనన్నారు. తమ శాఖపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వంద రెట్లు పెంచే విధంగా పని చేస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ విజయారావు, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిథి ఉజ్జీవ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మామిడి మురళి, పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వడ్డి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.