కృష్ణ

రైతు పక్షపాతి జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు : రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. నియోజకవర్గ కేంద్రం పామర్రులో మంగళవారం వైఎస్‌ఆర్ రైతు భరోసా - ప్రధాన మంత్రి కిసాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రైతులకు ప్రత్యక్ష దైవంగా నిలిచారన్నారు. జిల్లాలో మొత్తం 2లక్షల 43వేల 947 మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.329కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం నడుస్తోందన్నారు. రైతు ఆనందంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు డైరెక్టర్ కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్, వివిధ శాఖల అధికారులు ప్రసంగించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ వారు ఏర్పాటు చేసిన పలు రకాల అంశాల ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి.

భావదేవరపల్లిలో ఉపాధి పనులు గుర్తింపు
నాగాయలంక, అక్టోబర్ 15: మండలంలోని భావదేవరపల్లి పంచాయతీ పరిధిలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గుర్తించేందుకు ఆ పథకం ఏపీఓ కె రవికుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఈ పథకం కింద 125 పనులను గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి లేని వ్యవసాయ కార్మికులకు ఉపాధిని కల్పించాలన్న ధ్యేయంతో వివిధ పనులను గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భావదేవరపల్లి పంచాయతీ కార్యదర్శి పి మల్లిఖార్జునరావు పర్యవేక్షించగా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, కార్మికులు పాల్గొన్నారు. ఈ పథకంలో భాగంగా పెదకమ్మవారిపాలెం గ్రామంలో కూడా ఉపాధి హామీ పనులను గుర్తించేందుకు నిర్వహించిన సమావేశంలో 35 పనులను గుర్తించినట్లు ఏపీఓ తెలిపారు. ఈ సమావేశాన్ని కూడా పంచాయతీ కార్యదర్శి కె మల్లిఖార్జునరావు పర్యవేక్షించగా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, కార్మికులు పాల్గొన్నారు.

దివిసీమకు దాళ్వా ఇవ్వాలి
నాగాయలంక, అక్టోబర్ 15: దివిసీమలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ భూములలో ఈ సంవత్సరం రెండవ పంటగా దాళ్వా సాగు చేసుకునేందుకు అవసరమైన సాగునీటిని విడుదల చేయాలని డిస్టిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ బీసాబత్తిన ప్రసాద్ కోరారు. మంగళవారం ఆయన అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబును కలుసుకుని నాగాయలంక మండలంలోని పల్లపు భూములలో అపరాల పంట పండేందుకు అవకాశం లేనందున దాళ్వా సాగు చేసుకోవడం తప్పనిసరి అన్నారు. దాళ్వా సాగు వల్ల ఈ ప్రాంత రైతుల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు అధికంగా ఉంటుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సార్వా సాగు పూర్తయిన తదుపరి ఈ ప్రాంత వ్యవసాయ కార్మికులు తమ ఉపాధి అవకాశాలకై పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ పరిస్థితులు దృష్ట్యా దివిసీమ ప్రాంతానికి 2వ పంట వేసుకునేందుకు అవసరమైన సాగునీటిని విడుదల చేయాలని ప్రసాద్ ఎమ్మెల్యే రమేష్‌బాబును కోరారు.