కృష్ణ

కృష్ణానదిపై రూ.3,400 కోట్లతో మూడు చెక్‌డ్యామ్‌లకు ప్రణాళికలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : కృష్ణానదిపై మూడు ప్రాంతాలలో రూ.3,400 కోట్ల వ్యయంతో చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అంగీకారం తెలియజేయటం ద్వారా అంచనాలు కూడా పూర్తయినట్లు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వైకాపా రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల ఆరు నియోజకవర్గాలైన అవనిగడ్డ, రేపల్లె, వేమూరు, తెనాలి, మంగళగిరి, పామర్రు నియోజకవర్గాలకు సాగునీటి కొరత ఉండదన్నారు. ఈ పథకాన్ని ఆమోదించడం ముఖ్యమంత్రి జగన్ వల్లే సాధ్యపడిందన్నారు. ఎంతో ఆసక్తిగా ఈ నిర్మాణంపై అధికారులను ఆదేశించారన్నారు. నియోజకవర్గంలోని దాదాపు రూ.18లక్షల 38వేల రైతు భరోసా నిధులను 27,460 మంది లబ్ధిదారులను గుర్తించటం ద్వారా ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని అందించటం జరుగుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారి సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్, ఆర్డీఓ ఖాజావలి, వైసీపీ నాయకులు కె నరసింహారావు, రేపల్లె శ్రీనివాసరావు, బి వెంకట్రావు, బండే శేషగిరిరావు, రాజయ్య, ఆరు మండలాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.