కృష్ణ

రైతన్నకు అండగా జగనన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అండగా నిలుస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. నవరత్నాలలో ప్రాధాన్యతా అంశమైన వైఎస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని బుద్ధాలపాలెం గ్రామంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వ్యవసాయం భారంగా ఉన్న సమయంలో రైతు భరోసా ద్వారా యేడాదికి రూ.13,500లు పెట్టుబడి సాయంగా అందించడం ఓ చారిత్రాత్మకమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటుందన్నారు. ఈ పథకం కింద ప్రతి యేడాది అక్టోబర్‌లో రబీ సాగు అవసరాలకు రూ.4వేలు, మే నెలలో ఖరీఫ్ పంట వేసే సమయంలో రూ.7500లు, పంట చేతికి వచ్చే సమయమైన సంక్రాంతి పండుగ నాటికి రూ.2వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. జిల్లాలో 4లక్షల రైతు కుటుంబాలలో 13.20లక్షల మంది రైతులను ఈ పథకం కింద అర్హులుగా గుర్తించామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 7,355 మంది రైతులకు రూ.9.93కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ మోహనరావు, మెప్మా పీడీ జివి సూర్యనారాయణ, ఆర్డీవో ఖాజావలి, వ్యవసాయ శస్తవ్రేత్త డా. గిరిజా రాణి, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, తహశీల్దార్ సునీల్ బాబు, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, ఎఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.