కృష్ణ

ఒంగోలు జాతి పశు సంపద పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం : ఒంగోలు జాతి పశు సంపదను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. గన్నవరం వైకాపా సమన్వయకర్త యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్యశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనను ఆయన శనివారం రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేలా సీఎం జగన్మోహనరెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పోటీలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఒంగోలు జాతి పశు సంపద మన రాష్ట్రంలో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్ దేశం మన రాష్ట్రం నుంచి ఒంగోలు జాతి ఎడ్లు కొనుగోలు చేసి అభివృద్ధి చేస్తే ఇప్పుడు మనం దిగుమతి చేసుకునే స్థితికి రావడం విచారకరమన్నారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న ఒంగోలు జాతిని భావితరాలకు అందించేందుకు అందరూ సమష్టి కృషి చేయాలని కోరారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం ఖర్చుతో కూడుకోడమే కాక ఎంతో శ్రమపడాల్సి వస్తుందన్నారు. మంత్రి కన్నబాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ది సంస్ధ మాజీ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్, పోటీల నిర్వాహాకులు కాసంనేని రాజా, బాల నరేష్, బాబి తదితరులు పాల్గొన్నారు.
పవన విద్యుత్ సంస్థలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వం
- ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

మచిలీపట్నం, అక్టోబర్ 13: కమిషన్ల కోసం పవన విద్యుత్ సంస్థలను అధికార వైసీపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని శాసనమండలి సభ్యుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. ఆదివారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కమిషన్ల కోసం విద్యుత్ కోతలను సృష్టిస్తోందన్నారు. రూ.4.84లకు వచ్చే పవన విద్యుత్‌ను కొనకుండా రూ.11.68లు పెట్టి పక్క రాష్ట్రం నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. మహానది కోల్ ఫీల్డ్‌లో రూ.1600లకే ఒక టన్ను బొగ్గు సరఫరాకు ఒప్పందం ఉండగా తెలంగాణ రాష్ట్రం నుండి రూ.3,700లు పెట్టి కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ రాష్ట్రానికి రాసిన లేఖలో రానున్న 25 యేళ్లకు కూడా పవన విద్యుత్ ధర స్థిరంగా రూ.4.84లకే సరఫరా అవుతుందని, అదే కాలానికి ధర్మల్ విద్యుత్ అయితే యూనిట్ రూ.22లు అవుతుందని హెచ్చరించిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.