కృష్ణ

కూచిపూడి నాట్యాన్ని సశాస్ర్తియంగా భావి తరాలకు అందించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : కూచిపూడి నాట్య గురువుల కృషి ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి నాట్యాన్ని సశాస్ర్తియంగా భావి తరాలకు అందచేసేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం తనవంతు కృషి చేస్తోందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వైకె సుందరకృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాట్య క్షేత్రం కూచిపూడిలోనే నాట్య శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులకు విశ్వవిద్యాలయమే సర్ట్ఫికెట్లు అందచేసి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోందన్నారు. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం 90వ జయంతి సందర్భంగా 90 జ్యోతులు వెలిగించి విద్యార్థులు నృత్య నీరాజనాలు సమర్పించారు. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి అధ్యక్షుడు డా. చింతా ఆది నారాయణశర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొదలి నాగభూషణ శర్మ కుమారుడు మొదలి శరత్, విశ్వవిద్యాలయం గెస్ట్ ప్యాకల్టీ డి శ్రీదేవి, డా. వెంపటి చినసత్యం కుమార్తెలు మేళ్లచెరువు కామేశ్వరి, చావలి బాలాత్రిపుర సుందరి తదితరులు ప్రసంగించారు. ఆచార్య మొదలి నాగభూషణ శర్మ మెమోరియల్ కూచిపూడి ఆర్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, గ్రంథాలయాన్ని అతిథులు ప్రారంభించారు. 2015-19 మాస్టర్ ఆఫ్ ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూచిపూడి నాట్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం ఉపకులతి ఆచార్య వైకె సుందరకృష్ణ అతిథులు సర్ట్ఫికెట్లు అందజేశారు. అంతకుముందు స్మృతి సదనంలోని డా. వెంపటి చినసత్యం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.