కృష్ణ

ప్రజా సమస్యలే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకు వెళ్లడమే ప్రధాన అజెండా కావాలని తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయించింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సమావేశమైన జిల్లా కమిటీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నూతన ఇసుక విధానం పేరుతో ఏర్పడిన ఇసుక కొరత, సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ పటిష్ఠత, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా తీసుకోవల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, శాసనమండలి సభ్యుడు పరుచూరి అశోక్ బాబుతో పాటు జిల్లాలోని 16 నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు హాజరయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ అవలంభించాల్సిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. ప్రజా సమస్యలే అజెండా కావాలన్నారు. ప్రజా పోరాటాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా ఏ మాత్రం నీరసించకుండా పోరాట పటిమతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయ పడింది. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, దీన్ని అవకాశంగా తీసుకుని ప్రజల పక్షాన నిలబడి పోరాడాలన్నారు. ఇకపై ప్రతి నెలా ఒక్కొక్క నియోజకవర్గంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. నియోజకవర్గాల వారీగా నెలకొన్న సమస్యలతో పాటు పార్టీని సంస్థాగతంగా పటిష్ఠపర్చే దిశగా కార్యాచరణ తయారు చేయాలన్నారు. గత మే నెలలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరగలేదన్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఎన్నికల అనంతరం జిల్లాలో కూడా సంస్థాగత ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. అందరికీ పెన్షన్ అంటున్న ప్రభుత్వం 70 శాతం మేరకు కూడా పెన్షన్‌లను బట్వాడా చేయలేకపోతోందని సమావేశం విమర్శించింది. సీఎం డ్యాష్ బోర్డులో 90శాతం పెన్షన్‌లు ఇచ్చామని చూపుతున్నారే గానీ క్షేత్ర స్థాయిలో 70 శాతం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టే విధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసులు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, నల్లగట్ల స్వామిదాసు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పెడన నియోజకవర్గ సమన్వయకర్త కాగిత కృష్ణప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బండారు హనుమంతరావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్తా నాగేంద్ర కుమార్, జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి తదితరులు పాల్గొన్నారు.