కృష్ణ

జగన్ సర్కార్‌కు కనువిప్పు కలిగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న అధికార పక్షానికి కనువిప్పు కలిగేలా రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇసుక కొరతపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం చేపట్టిన 36గంటల నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఓ భవన నిర్మాణ కార్మికుడితో రవీంద్రకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక కొరతతో యావత్తు భవన నిర్మాణ రంగమంతా రోడ్డున పడితే పరిష్కార చర్యలు చూపాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రవీంద్ర చేపట్టిన నిరవధిక దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారన్నారు. అధికారం ఉంది కదా అని పోలీసులను పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకుని ప్రజా ఉద్యమాలను అణచివేసే దిశగా జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని దుమ్మెత్తి పోశారు. ప్రతిపక్ష నాయకులుగా ప్రజా సమస్యలపై తాము పోరాడుతుంటే హౌస్ అరెస్టుల పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డే 144 సెక్షన్ లేకుండా తన నివాసంలో ఉండలేకపోతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. నిర్మాణాత్మకంగా జరగాల్సిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో అధికార పక్ష ఎమ్మెల్యేలు మాట్లాడిన ధోరణి వారి అధికారదర్పానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అధికారం ఉంది కదా అని శ్మశానాలకు కూడా వైసీపీ రంగులు వేసుకుంటున్నారని రానున్న రోజుల్లో సెప్టిక్ ట్యాంక్‌లకు రంగులు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. జగన్మోహనరెడ్డి తుగ్లక్ చర్యలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ ఇసుక కొరతతో 26 భవన నిర్మాణ రంగానికి చెందిన 30 నుండి 40లక్షల మంది కార్మికులు పొట్ట చేత పట్టుకుని రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ప్రతిపక్షంగా తమకు లేదా అని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉంది కదా అని కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నియంతలా వ్యవహరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కల్పించే విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను హౌస్ అరెస్టులు చేసినా, అక్రమ కేసులు బనాయించినా, చివరికి ఉరి తీసినా ఉద్యమం మాత్రం ఆగదన్నారు. మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, నల్లగట్ల స్వామిదాసు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హిదాయ్ తుల్లా తదితరులు పాల్గొన్నారు.