కృష్ణ

‘కొల్లు’ దీక్షకు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన 36 గంటల నిరవధిక నిరాహార దీక్షకు భవన నిర్మాణ కార్మికుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఇసుక కొరతను నిరసిస్తూ శుక్రవారం రవీంద్ర తన ఇంటి వద్ద నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. రెండవ రోజైన శనివారం రవీంద్ర చేపట్టిన దీక్షకు పార్టీ కార్యకర్తలతో పాటు భవన నిర్మాణ కార్మికుల నుండి మద్దతు లభించింది. దీక్షలో కూర్చున్న రవీంద్రను వివిధ కార్మిక వర్గాలకు చెందిన వారు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఇసుక కొరత వల్ల తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో దీక్షా శిబిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం 6గంటల సమయంలో రవీంద్ర తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసే దీక్షకు ప్రజల నుండి ఎక్కడ స్పందన వస్తుందోనన్న భయంతో దీక్షను భగ్నం చేయాలని చూశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అన్ని వర్గాలను రోడ్డుకు ఈడ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇసుక కొరత వల్ల నేడు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తీసుకు వచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. తాను చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచిన భవన నిర్మాణ రంగ ప్రతినిథులందరికీ రవీంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నియోజకవర్గ్భావృద్ధికి నిధుల పట్ల హర్షం
నందిగామ, అక్టోబర్ 12: నందిగామ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆమోదం తెలపడం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ నందిగామ నియోజకవర్గంలో ప్రాతినిత్యం వహించినా ఎటువంటి అభివృద్ధి నోటుకోలేదన్నారు. నియోజకవర్గంలో పలు ప్రధాన సమస్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలియజేశారన్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్మోహనరెడ్డికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.