కృష్ణ

వ్యక్తిగత ఆదాయ పన్ను శాతం తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం,: మధ్య తరగతి ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తిగత ఆదాయ పన్ను శాతం తగ్గించమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామ్‌ను అభ్యర్థిస్తూ శనివారం లేఖ రాశారు. ప్రజలందరూ గత జూన్ బడ్జెట్‌లోనే ఆదాయ పన్ను పరిమితిని పెంచుతారని ఆశించి నిరుత్సాహపడ్డారని, ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాని వల్ల ప్రజల వద్ద నగదు లభ్యత పెరిగి కొనుగోళ్లు ఊపందుకుంటాయని, తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల వచ్చే మిగులు నగదు కార్పొరేట్ సంస్థలు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలోనికి తీసుకు వస్తాయో లేదో తెలియదు కానీ వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు తగ్గించటం వలన వచ్చే మొత్తం మిగులు నగదును తప్పని సరిగ్గా ప్రజల అదనపు కొనుగోలు విక్రయాల ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.