కృష్ణ

కటాఫ్ మార్కుల ఆధారంగానే నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కటాఫ్ మార్కుల ఆధారంగానే గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సచివాలయ పోస్టుల భర్తీ, సచివాలయాల ఏర్పాటు తదితర అంశాలపై వివిధ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 845 గ్రామ సచివాలయాలను సిద్ధం చేయగా 700 సచివాలయాలను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలలో వివిధ పోస్టులలో చేరిన ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్ట్ఫికేట్ వెరిఫికేషన్ కోసం రాని వారు, వచ్చినప్పటికీ విధుల్లో చేరని వారికి ఫోన్ చేసి కారణాలు తెలుసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరిలకు వివిధ సచివాలయ పోస్టుల అర్హత మార్కులు ప్రభుత్వం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తద్వారా మరికొంత మంది అర్హత సాధిస్తారని, వెంటనే వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రేడ్-5 గ్రామ కార్యదర్శి పోస్టులకు సంబంధించి 702 మంది ఎంపికవ్వగా 503 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. వీరిలో 324 మంది విధుల్లో చేరారన్నారు. సంక్షేమ, విద్య సహాయక పోస్టులకు సంబంధించి 845 ఖాళీలకు గాను 603 మందికి నియామక పత్రాలు అందించగా 572 మంది విధుల్లోకి వచ్చినట్లు తెలిపారు. గ్రామ మహిళా పోలీసు పోస్టులకు సంబంధించి 702 మంది సర్ట్ఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోగా 606 మంది తమ అంగీకారం తెలిపారన్నారు. వీరిలో 350 మందికి నియామక పత్రాలు అందజేశామని, రెండు రోజుల్లో మిగిలిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు కలెక్టర్‌కు తెలియజేశారు. వార్డు పరిపాలనా కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబందించి 317 మంది విధుల్లో చేరారని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు 375 మందికి నియామక పత్రాలు అందజేసి 355 మందికి పోస్టింగ్‌లు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 191 మందిని సర్ట్ఫికేట్ వెరిఫికేషన్‌కు పిలువగా 144 మంది వచ్చారని, వీరిలో 104 మందికి నియామక పత్రాలు అందజేశామన్నారు. ఇంకా 148 ఖాళీలు ఉన్నాయన్నారు. మత్స్య శాఖ సహాయక పోస్టులు 106కు గాను 100 మంది అర్హత సాధించారన్నారు. 56 మంది సర్ట్ఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాగా 53 మంది విధుల్లో చేరారన్నారు. గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శి పోస్టులు (డిజిటల్ అసిస్టెంట్)కు 440 మంది ఎంపికవ్వగా 272 మంది సర్ట్ఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైనట్లు తెలిపారు. వీరిలో 200 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 630 మంది సర్ట్ఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారని తెలిపారు. వీరిలో 550 మందికి నియామక పత్రాలు ఇవ్వగా 220 ఖాళీలు ఉన్నాయన్నారు. విలేజ్ సర్వేయర్ పోస్టులకు సంబంధించి 714 మంది సర్ట్ఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోగా 548 మంది జాయిన్ అయ్యారన్నారు. ఎఎన్‌ఎం/వార్డు హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు 1126 మంది అర్హత సాధించగా వీరిలో 1045 మంది సర్ట్ఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారని, 627 మందికి నియామక పత్రాలు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఇఓ టి సూర్యప్రకాశరావు, జేసీ-2 మోహన్ కుమార్, ఆర్డీవో జె ఉదయ భాస్కర్, సీపీఓ భాస్కర శర్మ, మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ మోహనరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. మూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ జెడీ పిఎస్‌ఎ ప్రసాద్, పశు సంవర్ధక శాఖ జేడీ భరత్ కుమార్, మత్స్య శాఖ ఎడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.