కృష్ణ

డిసెంబర్ 17న ‘చలో ఢిల్లీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం : పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నేత మందా వేణుమాదిగ అన్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నూతన గ్రామ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ఆదివారం వీరపనేని వారిగూడెం గ్రామ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు సాంకేతికంగా ఏ విధమైన అడ్డంకులు లేనప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిర్రా అశోక్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ ప్రభుత్వం
గన్నవరం, సెప్టెంబర్ 22: లక్షలాది మంది నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు, వాలంటీర్ల పోస్టులు, సచివాలయ పోస్టులు కట్టబెడుతూ అర్హులైన పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని టీడీపీ సీనియర్ నాయకుడు మనె్న సుందరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం వస్తే మన కుటుంబాలు బాగుపడతాయని అనేక మంది పేదలు కోచింగ్‌ల కోసం వేలాది రూపాయలు వెచ్చించి రేయింబవళ్ళు కష్టించి సిద్ధపడ్డ 19 లక్షల ఉద్యోగ భవిష్యత్‌పై జగన్ ప్రభుత్వం దెబ్బకొట్టిందని అన్నారు. ఈ సమావేశంలో తాడిగడప రవి, కంభంపాటి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.