కృష్ణ

ఇసుక కష్టాలు తీరినట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : సరిహద్దు రాష్ట్రానికి ఇసుక అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ టాస్క్ఫోర్క్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులతో సమీక్షించి నూతన ఇసుక పాలసీపై ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలను వివరించారు. జిల్లాలో ఏడాదికి 10లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరాలు ఉంటున్నాయని అధికారులు అంచనా వేశారన్నారు. జిల్లాలో ప్రస్తుతం నందిగామ మండలం కంచెల, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు స్టాక్ యార్డులలో ఇసుక అందుబాటులో ఉందన్నారు. వీటితోపాటు చందర్లపాడు మండలం కాసరబాద, కంచకచర్ల మండలం చెవిటికల్లు, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు, నందిగామ మండలం కంచెల, తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరు, ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక రీచ్‌లు ప్రస్తుతం వరద నీటిలో ఉన్నాయని, తగ్గుముఖం పట్టిన వెంటనే అందుబాటులోకి వస్తాయన్నారు. వీటితోపాటు కొత్తగా 10 రీచ్‌లను గుర్తించామని తెలిపారు. వీటిలో చందర్లపాడు మండలం ఏటుకూరు, ఉస్తేపల్లి, కంచికచర్ల మండలం మున్నలూరు, కునికినపాడు, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు-2, ఉబ్బాయగూడెం, పమిడిముక్కల మండలం లంకపల్లి - 1, 2, కంకిపాడు మండలం మద్దూరు - 1, 2 రీచ్‌లలో అనుమతుల కోసం ఏపీఎండీసీకి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వీటికి ప్రభుత్వం త్వరలో అనుమతులు మంజూరు చేస్తుందని, తద్వారా జిల్లాలో ఇసుక కొరతే ఉండదన్నారు. అవసరాలు తీరి మిగులు ఇసుక ఉండే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా గట్టి నిఘా ఉంచాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సరిహద్దు మండలాలైన జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, పెనుగంచిప్రోలు, వీరుళ్లపాడు, జి కొండూరు, మైలవరం, ఏ కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, చాట్రాయి పరిధి నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా, పర్యవేక్షణ పెట్టామన్నారు. జగ్గయ్యపేట మండలం దొండపాడు, గరికపాడు, వత్సవాయి మండలం పోలంపల్లి, తిరువూరు మండలం రాజుపేట వద్ద బోర్డరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచాలన్నారు. అవసరానికి మించి అధిక ఇసుకను డంప్ చేసేవారిపై దాడులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక విధానం పారదర్శకంగా తక్కువ ధరకే సామాన్య ప్రజలకు ఇసుక లభించే విధంగా ఉందన్నారు. అధికారులు నిఘా, పర్యవేక్షణపై దృష్టిసారించి ప్రజల అవసరాలు తీరేలా పనిచేయాలన్నారు. ప్రస్తుతం ఇసుక లభ్యత తక్కువగా ఉన్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్ దృష్టి పెట్టాలన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఫిర్యాదు రాకూడదన్నారు. రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. స్టాక్ పాయింట్లు రీచ్‌లకు దగ్గరలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు డివిజన్ల పరిధిలోని మండలాల్లో ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం ఇసుక టన్నుకు 375 రూపాయలుగా ధర నిర్ణయించిందన్నారు. రీచ్‌ల నుండి ఇసుక స్టాకు యార్డుకు ట్రాక్టర్ల ద్వారానే రవాణా జరగాలని, వాటికి జీపీఎస్ తప్పనిసరి అని చెప్పారు. రీచ్‌లలో తవ్వకాలకు యంత్రాలను వినియోగించ కూడదన్నారు. రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకూ, అలాగే స్టాక్ పాయింట్ల నుండి వినియోగదారులకు చేరేందుకు 24 గంటలూ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
జాయింట్ కలెక్టర్ కే మాధవీలత మాట్లాడుతూ అనుమతుల మంజూరుకు ప్రతిపాదించిన కొత్త రీచ్‌లకు స్టాకు పాయింట్లు గుర్తించాలని సూచించారు. స్టాక్ పాయింట్లు రీచ్ నుండి 5కిలోమీటర్ల దూరం లోపు, కనీసం రెండు ఎకరాల స్థలంలో ఉండాలన్నారు. అవసరమైతే పట్టాదారు భూమి అయినా తీసుకునేందుకు వీలుగా రెవెన్యూ అధికారులు గుర్తించి సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇన్‌చార్జి ఆర్డీవో చక్రపాణి, డిప్యూటీ కమిషనర్ బీ కోటేశ్వరరావు, డీఎస్పీ జీవీ రమణమూర్తి, డీపీవో అరుణ, మైనింగ్ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, తహశీల్దార్లు పాల్గొన్నారు.