కృష్ణ

సవాళ్లను అవలీలగా ఎదుర్కొన్న ధీరుడు ‘కోడెల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : అభివృద్ధి విషయంలో ఎన్నో సవాళ్లు ఏదురైనప్పటికీ అవలీలగా ఎదుర్కొన్న ఘనత దివంగత సభాపతి కోడెల శివప్రసాద్‌కే దక్కుతుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక గాంధీ క్షేత్రంలో డా. కోడెల సంస్మరణ సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగ్గా మాజీ జెడ్పీటీసీ కె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కోడెల ఒక సాహస వీరుడని, ప్రజాభిమానం చూరగొన్న గొప్ప వ్యక్తి అని, ధైర్యం ఆయన గొప్పతనమని ప్రశంసించారు. నర్సరావుపేట-సత్తెనపల్లి నియోజకవర్గాల అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదురైనా లెక్క చేయలేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను శ్మశానవాటికలకు వినియోగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ఒప్పించారన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవటం ఊహించని పరిణామం అన్నారు. సీబీఐ విచారణను దీటుగా ఎదుర్కొన్న కోడెల ఆత్మహత్యకు పాల్పడతారని ఎవ్వరూ ఊహించలేదన్నారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. తొలుత కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మత్తి శ్రీనివాసరావు, కర్రా సుధాకర్, లంకబాబు, ఎన్ జనార్ధనరావు, వి మురళీ, ఎం చంద్రరావు, మాజీ ఎంపీపీ కనకదుర్గ, రాఘవ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కేసుల ఛేదనలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు రివార్డులు అందజేత
మచిలీపట్నం(కోనేరుసెంటర్), సెప్టెంబర్ 18: కేసుల ఛేదనలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం జరిగిన బందరు, గుడివాడ, అవనిగడ్డ సబ్ డివిజన్‌ల నేర సమీక్షా సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు చేతుల మీదుగా రివార్డులు అందజేశారు. కేసుల చేధనతో పాటు లోక్ ఆదాలత్‌లో అత్యధిక కేసుల రాజీ, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించిన పోలీసు సిబ్బందికి రివార్డులు ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. బందరు డీఎస్పీ మొహబూబ్ భాషా, అవనిగడ్డ, చల్లపల్లి, బందరు తాలుకా సీఐలు బిబి రవి కుమార్, ఎన్ వెంకట నారాయణ, కొండయ్య, బందరు తాలుకా ఎస్‌ఐలు మూర్తి, మణికంఠ, హెచ్‌సీలు కె శ్రీనివాసరావు, వి వెంకట్రావు, యమ్‌పి ప్రసాద్, పీసీలు పి శ్రీ్ధర్, డివి రమణ, హెచ్‌జీ నాగేశ్వరరావులకు రివార్డులు అందజేశారు.