కృష్ణ

భారీ వర్షంతో వీధులు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు : తోట్లవల్లూరులో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవటంతో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వర్షం గంట పాటు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. శివారు కాలనీలు, పల్లపు రహదారులు నీటిలో మునగటంతో మురుగునీరు, వాననీరు ఏకమైంది. ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి చెరువును తలపించింది. వీధులన్నీ జలమయం కావటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడినప్పుడల్లా ప్రధాన రహదారులు, డ్రైన్‌లు పొంగిపొర్లుతున్నాయని, అధికారులు మాత్రం మురుగునీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టక పోవటంతో కొన్ని రోజుల పాటు వాననీరు రహదారుల మీద ఉండిపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వరద బాధిత రైతులకు
ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలి
చల్లపల్లి, సెప్టెంబర్ 17: వరదలలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఉచితంగా రబీ విత్తనాలు పంపిణీ చేయాలని, నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పరిహారం పంపిణీ, విత్తనాల సరఫరాలో ఆలస్యం జరిగితే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలుగు ప్రజల గౌరవానికి భంగకరంగా ఉన్న ఆంధ్రాబ్యాంక్ విలీనాన్ని విరమించుకోవాలని సూచించారు. అక్టోబర్ 19, 20, 21 తేదీలలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ సమితి సమావేశాలు పశ్చిమ బెంగాల్‌లో జరగనున్నాయని, ఈ మహాసభలు రైతాంగ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో గొరిపర్తి రామారావు, ప్రభాకరరావు, వాసు, ప్రసాద్, నాగమల్లి తదితరులు పాల్గొన్నారు.