కృష్ణ

కోడెల మృతికి తెలుగు తమ్ముళ్ల సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం : శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు మృతికి మైలవరం తెలుగుతమ్ముళ్ళు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోడెల ఆకస్మిక మృతి వార్త తెలియగానే సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కోడెల మృతి పార్టీకి తీరనిలోటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, హోం మంత్రిగా, నవ్యాంధ్రలో తొలి శాసన సభ స్పీకర్‌గా ఆయన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి లక్ష్మి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ గంజి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లెల రాధాకృష్ణ, కార్యదర్శి బాలకృష్ణ, నేతలు గొల్లపూడి వెంకటేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ షహానాబేగం, రుక్మిణి, సుభాని, వెంకయ్య, సాంబయ్య, అంజి, కరీమ్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

యూత్ ఫెస్టివల్‌లో విజేతగా నిలిచిన మొవ్వ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు
కూచిపూడి, సెప్టెంబర్ 16: కూచిపూడి రోటరీ క్లబ్ యూత్ ఫెస్టివల్‌లో భాగంగా సోమవారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో బాలురు, బాలికల విభాగాలలో మొవ్వ జెడ్పీ హైస్కూలు విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కోపూరి శ్రీనివాసరావు, కోనేరు మంజునాథ్‌లు తెలిపారు. డైరెక్టర్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు, పాగోలు రమేష్ బాబు పర్యవేక్షణలో ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వి శ్రీ్ధర్, పీఇటీ వేముల వెంకటేశ్వరరావు, నాగాయలంక, మోపిదేవి, పెడసనగల్లు, భట్లపెనుమర్రు గ్రామాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడ్డారు. బాలుర స్థానంలో ద్వితీయ స్థానాన్ని నాగాయలంక, బాలికల విభాగంలో పెడసనగల్లు విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు.

ప్రభుత్వ విప్ సామినేనికి ఘన సత్కారం
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 16: కాపు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, జగ్గయ్యపేటలో కూడా కాపులకు అన్ని విధులుగా తాను అండగా ఉంటానని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చెప్పారు. సోమవారం కృష్ణదేవరాయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో సామినేని ఉదయభాను దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సామినేని మాట్లాడుతూ కాపు కార్పొరేషన్‌కు భారీగా నిధులు కేటాయించి, కాపుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పథకం ప్రతి పేద కాపు కుటుంబానికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందే వారు ఈ నెల 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వై వెంకటేశ్వరరావు, ఆర్ కోటేశ్వరరావు సహాయంతో 45 వేల రూపాయల ఉపకార వేతనాలను విద్యార్థులకు అందజేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంలో పూల వర్షం కురిపిస్తూ సామినేనిని సన్మాన వేదిక వద్దకు నేతలు తీసుకువచ్చారు.

ఎదురుమొండి పంటు నిలిపివేత
నాగాయలంక, సెప్టెంబర్ 16: మండలంలోని ఏటిమొగ-ఎదురుమొండి కృష్ణానది పడమటి పాయ మధ్య నిర్వహిస్తున్న పంటును సోమవారం నిలిపి వేశారు. తహశీల్దార్ వెంకట్రామయ్య ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఫంటును నిలిపి వేశారు. ఎదురుమొండి, నాచుగుంట, ఏలిచెట్ల దిబ్బ గ్రామ పంచాయతీల పరిధిలో నివశిస్తున్న 10వేల మంది ప్రజలు ఈ ఫంటు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక అనుమతులు లేని కారణంగా ఫంటును నిలిపి వేసినట్లు వీఆర్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు.

దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 16: వృద్ధ వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు ఈ కృత్రిమ అవయవాలను అందజేశారు. కాళ్లు లేని పది మందికి కృత్రిమ కాళ్లు, నలుగురు బదిరులకు క్యాలీపర్స్, ముగ్గురు బదిరులకు స్మార్ట్ ఫోన్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జె ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.